Congress: కాంగ్రెస్లో చేరిన సంగారెడ్డి మున్సిపాలిటీ 28వ వార్డు నాయకులు
సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు.

సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరిన వేళ, అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా సంగారెడ్డి మున్సిపాలిటీలోని 28వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఊరట లభించగా, ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నాయకులు కాంగ్రెస్లోకి చేరారు.
28వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, గోపాల్ గౌడ్ తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు బొంగుల రవి వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన సందర్భంగా లక్ష్మారెడ్డి, గోపాల్ గౌడ్ మాట్లాడుతూ.. సంగారెడ్డి అభివృద్ధి జగ్గారెడ్డి నాయకత్వంలోనే సాధ్యమని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డుతో పాటు సంగారెడ్డి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేష్ ముదిరాజ్, ప్రదీప్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



