తెలంగాణసంగారెడ్డి

Sangareddy: మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం.. నిబంధనలివే

సంగారెడ్డి మున్సిపాలిటీ 2026 సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమైంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ 2026 సాధారణ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు రంగం సిద్ధమైంది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను సమర్పించేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను అధికారులు విడుదల చేశారు.

ముఖ్యమైన సూచనలు

నామినేషన్ పత్రాలను కేవలం తెలుగులో మాత్రమే పూర్తి చేయాలి. నామినేషన్ సెట్ లో ఫామ్ 2 నామినేషన్ పేపర్ తో పాటు ఆస్తులు అప్పుల వివరాలు, ఎన్నికల ఖర్చు డిక్లరేషన్ పత్రాలు ఉండాలి.

జతచేయవలసిన పత్రాలు

  • రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు.
  • తాజా బ్యాంక్ పాస్ బుక్.
  • అభ్యర్థి ఓటర్ ఐడీ జిరాక్స్.
  • అభ్యర్థి నో డ్యూస్ సర్టిఫికేట్.
  • గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన కుల ధృవీకరణ పత్రం జిరాక్స్.
  • ప్రతిపాదిత వ్యక్తి ఓటర్ ఐడి జిరాక్స్, నో డ్యూస్ సర్టిఫికేట్.

నామినేషన్ ఫీజు వివరాలు

  • సాధారణ కేటగిరీ అభ్యర్థులకు 2500 రూపాయలు కాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 1250 నిర్ణయించారు.
  • అభ్యర్థులు పైన పేర్కొన్న పత్రాలన్నింటినీ సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులోగా నామినేషన్లు సమర్పించాలని అధికారులు సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *