Sangareddy: కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన లాడే బాలు.. హరీష్ సమక్షంలో చేరిక
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన లాడే బాలు బీఆర్ఎస్ లో చేరారు. సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డుకు చెందిన కీలక యువ నాయకుడు లాడే బాలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లాడే బాలు తన సుమారు 100 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారికే బీఆర్ఎస్ ఎప్పుడూ అండగా ఉంటుందని, సంగారెడ్డి అభివృద్ధికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా హరీష్ రావు పేర్కొన్నారు.

అసంతృప్తి వల్లే పార్టీ మార్పు?
కాంగ్రెస్ పార్టీలో యువతకు, కష్టపడి పనిచేసే నాయకులకు సరైన గుర్తింపు లేదని లాడే బాలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అవకాశాలు దక్కకపోవడం, క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేసే పరిస్థితి లేకపోవడంతోనే తాను బీఆర్ఎస్‌లో చేరినట్లు ఆయన తెలిపారు. ఇటీవల సీనియర్ నాయకుడు పొన్న రాజేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడటంతో సంగారెడ్డి రాజకీయాలు వేడెక్కాయి.



