తెలంగాణసంగారెడ్డి

భారతినగర్ అభివృద్ధి అంశాలపై కమిషనర్‌తో సింధు ఆదర్శ్ రెడ్డి భేటీ

భారతినగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గురువారం సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి డివిజన్‌కు సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా భారతినగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీ రైతు బజార్‌లో దుకాణాల కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్‌ను కోరినట్లు తెలిపారు.

అలాగే డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న HMWSSB పనులను త్వరగా ప్రాసెస్ చేసి సంబంధిత శాఖకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలను సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు సింధు ఆదర్శ్ రెడ్డి తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *