తెలంగాణసంగారెడ్డి

Narsapur: రైతును స్తంభమెక్కించిన.. ఏఈ రామ్మూర్తికి.. షోకాజ్​ నోటీస్​!

* చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉన్నతాధికారుల కసరత్తు
* ‘జీతం తీసుకునే సారు ఒడ్డున కూర్చోని.. బక్కరైతును స్తంభమెక్కించాడు’ కథనానికి స్పందన
* ‘కందిలి’ ఫేస్​ బుక్​, ఇన్ స్టాగ్రాం వేదికల్లో వైరల్​ అయిన వీడియో
* అధికారి తీరును తప్పు పడుతూ 3,535 మంది ఈ వీడియో చేశారు
* రైతుల కష్టం, అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపిన ఈ వీడియోకు 9.54లక్షల వ్యూస్​

కందిలి, సంగారెడ్డి: నర్సాపూర్​ మున్సిపాలిటీలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్​ శాఖ ఏఈ రామ్మూర్తిపై చర్యల దిశగా అధికారులు ఉపక్రమించారు. ఆయనకు షోకాజ్​ నోటీసు జారీ చేశారు. రైతుల కష్టాన్ని, విద్యుత్​ శాఖ అధికారుల నిర్లక్ష్యవైఖరిని వెలుగులోకి తెచ్చేలా ‘కందిలి’ కథనాన్ని అందించింది. ‘‘జీతం తీసుకునే సారు ఒడ్డున కూర్చొని.. బక్క రైతును స్తంభమెక్కించాడు”శీర్షికన కథనం ఇవ్వడంతో పాటు, ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రాం సోషల్​ మీడియా ద్వారా వీడియోలను అందించింది. దీంతో విద్యుత్​ శాఖ మెదక్​ జిల్లా ఎస్​ఈ నారాయణ నాయక్​ స్పందించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఈ రామ్మూర్తిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా షోకాజ్​ నోటీసు అందించామని ‘కందిలి’ ప్రతినిధికి తెలిపారు.

చర్చనీయాంశంగా మారిన.. ఘటన!
మెదక్​ జిల్లా నర్సాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని హన్మంతాపూర్​ లో విద్యుత్​ తీగలు తెగాయి. రైతుల పొలాల్లో పడ్డాయి. వీటిని సరిచేయాలని చాలా సార్లు రైతులు కోరారు. అయినా విద్యుత్​ శాఖ అధికారులు పట్టించుకోలేదు. మూడు రోజుల తర్వాత ఏఈ రామ్మూర్తి పొలం వద్దకు వచ్చారు. తాను ఒడ్డున కూర్చొని, నారాయణ అనే రైతును స్తంభం ఎక్కించాడు. అతడితోనే తెగిన తీగలను సరిచేయించాడు. ఈ అంశమై ‘కందిలి’ ప్రత్యేక వార్తా కథనాలను అందించింది. దీంతో విద్యుత్​ అధికారుల తీరు తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

భారీస్థాయిలో స్పందించిన… వీక్షకులు!
రైతును స్తంభమెక్కించిన అంశంతో పాటు ఏఈ రామ్మూర్తి నిర్లక్ష్యంగా ఇచ్చిన సమాధానాలకు సంబంధించిన వీడియోను ‘కందిలి’ ఫేస్​ బుక్​, ఇన్​ స్టాగ్రాం వేదికల్లో పోస్ట్​ చేసింది. ప్రజలు భారీస్థాయిలో స్పందించారు. 24గంటల వ్యవధిలోనే ఈ వీడియోకు 9.54లక్షల వ్యూస్​ వచ్చాయి. 3,535 మంది ఈ వీడియోను షేర్​ చేశారు. 300 మందికి పైగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏఈ నిర్లక్ష్య పనితీరును తప్పుపట్టారు. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని ఆవేదనగా తెలిపారు. ఉన్నతాధికారులు ఇలాంటి విషయాలపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. విద్యుత్​ శాఖలో ఉన్న ఖాళీలనూ భర్తీ చేయాలని మరికొందరు కోరారు. దీంతో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *