తెలంగాణసంగారెడ్డి

మున్సిపల్ ఎన్నికలకు పటిష్ట నిఘా.. సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి – అడిషనల్ ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావ్ తెలిపారు.

సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ రఘునందన్ రావ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న సమస్యాత్మక, అతి సమస్యాత్మక (సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్) పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే గుర్తించి, అక్కడ నిఘాను కట్టుదిట్టం చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికల సందర్భంగా మద్యం, డబ్బు పంపిణీ వంటి ప్రలోభాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే, సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలను లేదా వ్యక్తులను కించపరిచేలా తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌వోలు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మౌలిక వసతులు సరిగ్గా లేని కేంద్రాల్లో తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *