ఏ2గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్, ఏ3గా బీఎల్ఎన్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఫార్ములా – ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో ఆయనను ఏ1గా చేర్చారు. ఏ2గా ఐఏఎస్ అర్వింద్ కుమార్, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి పేర్లను చేర్చారు. నిధుల దుర్వినియోగ అంశమై చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎస్ శాంతికుమారి మంగళవారం ఏసీబీకి లేఖ రాశారు. కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి లభించడంతో ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. అందులో భాగంగానే తాజాగా ఈ కేసులో ఏ1గా కేటీఆర్ పేరును చేర్చింది.
చర్చపెడితే సమాధానమిస్తా – కేటీఆర్
తనపై కేసు నమోదు చేసిన విషయమై కేటీఆర్ గురువారం అసెంబ్లీలోనూ మాట్లాడారు. సభలో చర్చ పెడితే తాను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన సవాల్ విసిరారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సభలో ఈ కార్ రేస్ అంశమై చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.