డిసెంబరు 21న ఉదయం 11 గంటలకు ప్రారంభం
రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ర్యాలీ నిర్వహించనున్నారు. డిసెంబరు 21న సంగారెడ్డిలోని ఐబీ నుంచి పాత బస్టాండు సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ఇది కొనసాగనుంది. ఉదయం 11 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి రాజ్యసభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాల్సిందేనని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జార్జ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఉదయం 10 గంటల వరకు ఐబీ వద్దకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.