ABSLI: హైదరాబాద్ వాసుల్లో పెరిగిన ఆర్థిక భరోసా.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ అ-నిశ్చిత్ సూచీ వెల్లడి
భవిష్యత్తు పట్ల ఉండే అభద్రతా భావం, అనిశ్చితిని ఎదుర్కోవడంలో హైదరాబాద్ ప్రజలు దేశవ్యాప్త సగటు కంటే మెరుగైన స్థితిలో ఉన్నారని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ తన తాజా అధ్యయనం అ-నిశ్చిత్ సూచీ 2.0లో వెల్లడించింది.

హైదరాబాద్: భవిష్యత్తు పట్ల ఉండే అభద్రతా భావం, అనిశ్చితిని ఎదుర్కోవడంలో హైదరాబాద్ ప్రజలు దేశవ్యాప్త సగటు కంటే మెరుగైన స్థితిలో ఉన్నారని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ తన తాజా అధ్యయనం అ-నిశ్చిత్ సూచీ 2.0లో వెల్లడించింది. దేశవ్యాప్త అనిశ్చితి సూచీ 79 వద్ద ఉంటే, హైదరాబాద్లో అది 76 వద్దే ఉండటం గమనార్హం. అంటే ఇక్కడి ప్రజలు తమ ఆర్థిక భవిష్యత్తుపై కాస్త ఎక్కువ ధీమాగా ఉన్నారు. అయితే దక్షిణాదిలోని ఇతర ప్రధాన నగరాల సగటు (71) కంటే ఇది స్వల్పంగా ఎక్కువే.
డేటా భద్రతపై పెరుగుతున్న గుబులు
హైదరాబాద్ వాసుల ఆలోచనల్లో ప్రస్తుతం ఆర్థిక భయం కంటే డిజిటల్ రిస్కులే ఎక్కువగా రాజ్యమేలుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం నగర వాసులను ప్రధానంగా వేధిస్తున్న మూడు అంశాలు వ్యక్తిగత సమాచారం (Data) గోప్యత. ఆన్లైన్ నగదు లావాదేవీల రక్షణ. విస్తరిస్తున్న సైబర్ మోసాలు (Online Scams).
వీటితో పాటు నేరాల పెరుగుదల, వాయు కాలుష్యం, వేగంగా పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా నగర వసతులు ఉంటాయా లేదా అనే సందేహాలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పాలసీలు పెరిగే కొద్దీ తగ్గుతున్న భయం
ఈ అధ్యయనంలో ఒక ఆసక్తికరమైన అంశం బయటపడింది. ఆర్థిక క్రమశిక్షణ, బీమా కలిగి ఉండటం వల్ల అభద్రతా భావం గణనీయంగా తగ్గుతోంది. ఒకటి లేదా రెండు ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నవారిలో అనిశ్చితి 77గా ఉంటే, నాలుగు అంతకంటే ఎక్కువ పాలసీలు కలిగి ఉన్నవారిలో అది 64కి తగ్గిపోయింది. పెట్టుబడుల వైవిధ్యం (Diversification) కూడా ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది.
ఆదాయ వర్గాల మధ్య వ్యత్యాసం
ఆర్థిక స్థితిగతులను బట్టి అనిశ్చితి స్థాయిలు మారుతున్నాయి. ఎగువ ఆదాయ వర్గాల్లో (SEC A) ఆందోళన కేవలం 64గా ఉండగా, మధ్య, దిగువ తరగతి వర్గాల్లో (SEC B & C) ఇది 82-83 వరకు ఉంది. డెమోగ్రాఫిక్స్ పరంగా చూస్తే, యువతతో పోలిస్తే పెద్దవారిలో, ఒంటరి వారితో పోలిస్తే పిల్లలు ఉన్న వివాహితులలో అనిశ్చితి కొంత అధికంగా ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. క్రియాశీలకమైన ఆర్థిక ప్రణాళికలు, తగినంత ఇన్సూరెన్స్ రక్షణ ద్వారా ఈ అనిశ్చితిని తగ్గించి, సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఈ నివేదిక సారాంశం.



