బిజినెస్

కార్పొరేట్ రంగంలో సమ్మిళితత్వ విప్లవం: గోద్రెజ్ గ్రూప్ ఆధ్వర్యంలో ‘ప్రైడ్@గోద్రెజ్ 2026’ వేడుకలు!

భారతదేశంలో క్వీర్ (LGBTQIA+) వర్గాల హక్కులు, వారి సమ్మిళితత్వం సమాన అవకాశాలపై కార్పొరేట్ స్థాయిలో సరికొత్త ఆలోచనలను పంచుకోవడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ముందడుగు వేసింది.

భారతదేశంలో క్వీర్ (LGBTQIA+) వర్గాల హక్కులు, వారి సమ్మిళితత్వం సమాన అవకాశాలపై కార్పొరేట్ స్థాయిలో సరికొత్త ఆలోచనలను పంచుకోవడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ముందడుగు వేసింది. సమ్మిళిత సమాజ నిర్మాణానికి సంబంధించి తమకున్న సుదీర్ఘ నిబద్ధతను చాటుకుంటూ, ‘గోద్రెజ్ వన్’ వేదికగా ‘ప్రైడ్@గోద్రెజ్ 2026’ వేడుకలను సంస్థ అత్యంత వైభవంగా నిర్వహించింది. క్వీర్ వర్గాల అభివృద్ధిపై చర్చలు జరపడానికి, సామూహిక ఆలోచనలను పంచుకోవడానికి కంపెనీ ఉద్యోగులు, కమ్యూనిటీ నాయకులు, రచయితలు, కార్యకర్తలు మద్దతుదారులందరినీ ఈ కార్యక్రమం ఒకే చోటుకు చేర్చింది. ఇది గోద్రెజ్ సంస్థకు ఉన్న నమ్మకం, నిష్పాక్షికత గౌరవం వంటి నైతిక విలువలను ప్రతిబింబిస్తోంది.

ఈ ప్రైడ్ సంబరాలు గోద్రెజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (GCPL) సీఈఓ సుధీర్ సీతాపతి నాయకత్వంలో జరిగిన వార్షిక ‘ప్రైడ్ మార్చ్’తో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ‘గోద్రెజ్ వన్’ ప్రాంగణంలో జరిగిన ఈ మార్చ్‌లో కంపెనీ ఉద్యోగులు, ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున పాల్గొని LGBTQIA+ వర్గానికి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి అడ్డంకులు లేకుండా తమ నిజమైన గుర్తింపుతో ఆఫీసుల్లో పనిచేసుకునేలా, సమాన అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన నిబద్ధత అని గోద్రెజ్ గ్రూప్ ఈ సందర్భంగా చాటిచెప్పింది.

‘ప్రైడ్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టూల్‌కిట్’ విడుదల
ఇదే వేదికపై జీసీపీఎల్ సీఈఓ సుధీర్ సీతాపతి ‘ప్రైడ్ ఇన్ మాన్యుఫ్యాక్చరింగ్ టూల్‌కిట్’ను అధికారికంగా విడుదల చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ ఎఫ్‌ఎమ్‌సీజీ (FMCG) రంగానికి చెందిన కంపెనీలలో పనిచేసే క్వీర్ వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేని, గౌరవప్రదమైన చట్టపరమైన అవగాహనతో కూడిన సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడానికి ఈ ప్రాక్టికల్ గైడ్ పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

‘కువైర్ ఇండియా నౌ!’ పుస్తకావిష్కరణ:
‘ప్రైడ్@గోద్రెజ్ 2026’ వేడుకల్లో ‘కువైర్ ఇండియా నౌ!’ (Queer India Now!) అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం ఒక కీలక ఘట్టంగా నిలిచింది. క్వీర్ వర్గాల రచయితల వినూత్న రచనలతో కూడిన ఈ సరికొత్త సంకలనాన్ని (Anthology), ‘కువైర్ డైరెక్షన్స్’ సిరీస్ కింద వెస్ట్‌ల్యాండ్ ప్రచురణ సంస్థ గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ సంయుక్తంగా ప్రచురించాయి. ప్రముఖ జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు అయిన ధ్రుబో జ్యోతి, ధామిని రత్నంలు ఎడిటర్లుగా వ్యవహరించిన ఈ పుస్తకంలో.. భారత్‌లోని క్వీర్ వ్యక్తుల గుర్తింపు, వారి గౌరవం, సమాజంలో వారి ఉనికి వారి నిజ జీవిత అనుభవాలకు సంబంధించిన విభిన్న కథనాలను చక్కగా విశ్లేషించారు.

క్వీర్ లీడర్లను తీర్చిదిద్దేందుకు ‘కువైర్ ఇండియా ఫెలోషిప్’ ప్రారంభం
భవిష్యత్ క్వీర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు గోద్రెజ్ ఫౌండేషన్ గోద్రెజ్ డీఈఐ ల్యాబ్ సంయుక్తంగా కలిసి అందిస్తున్న వార్షిక లీడర్‌షిప్ ప్రోగ్రామ్ ‘కువైర్ ఇండియా ఫెలోషిప్’ను కూడా ఈ వేదికపైనే ప్రారంభించారు. 12 నెలల (ఒక సంవత్సరం) పాటు సాగే ఈ వినూత్న కార్యక్రమం ద్వారా, సమాజంలో ఉద్భవిస్తున్న క్వీర్ నాయకులకు అంతర్జాతీయ స్థాయి మెంటార్‌షిప్, శిక్షణ వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేసే అరుదైన అవకాశాన్ని కల్పిస్తారు. ముఖ్యంగా ఇప్పటివరకు క్వీర్ వర్గాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉన్న రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతూ, వారిని లీడర్లుగా తీర్చిదిద్దడమే ఈ ఫెలోషిప్ ముఖ్య లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు.

సృజనాత్మకత సాహిత్య చర్చలు
సాయంత్రం జరిగిన ఈ వేడుకలలో ఆకట్టుకునే నృత్య ప్రదర్శనలు, క్వీర్ బజార్ ఉద్యోగాల కోసం ప్రత్యేక హైరింగ్ బూత్ ఏర్పాటు చేయడం విశేషం. వీటితో పాటు క్వీర్ సాహిత్యం, వారి సామాజిక గుర్తింపు, సమాజంలో వారికి దక్కాల్సిన సమానత్వంపై పలువురు రచయితలు, కళాకారులు పాల్గొని పుస్తక పఠనాలు, ప్యానెల్ చర్చలు నిర్వహించారు. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.పి. షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరింత సమ్మిళిత సమాజాన్ని నిర్మించడంలో గౌరవం, సమానత్వం రాజ్యాంగ విలువల ప్రాధాన్యత ఎంతైనా ఉందని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *