ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ లాభం 27.8 శాతం వృద్ధి
ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బీమా రంగ అగ్రగామి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం 27.8 శాతం వృద్ధి చెంది రూ. 386 కోట్లకు చేరింది.

ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బీమా రంగ అగ్రగామి ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం 27.8 శాతం వృద్ధి చెంది రూ. 386 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఇది రూ. 302 కోట్లుగా నమోదైంది. నికర ప్రీమియం ఆదాయం రూ. 8,503 కోట్ల నుంచి రూ. 9,749 కోట్లకు పెరిగింది.
న్యూ బిజినెస్ ప్రీమియం 21 శాతం వృద్ధి చెంది రూ. 4,012 కోట్ల నుంచి రూ. 4,866 కోట్లకు పెరిగింది. 2026 జూన్ 30 నాటికి సంస్థ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 3.34 లక్షల కోట్లుగా ఉంది. నికర విలువ రూ. 14,375 కోట్లుగా ఉంది. జూలై 6న జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో కంపెనీ పేరును ‘ఐసీఐసీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్’గా మార్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది.
దీనికి బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ అనుమతి రావాల్సి ఉంది. “ఐసీఐసీఐ సంస్థ యొక్క పటిష్టత, విశ్వసనీయత, వారసత్వాన్నిఈ పేరు ప్రతిబింబిస్తుంది” అని సంస్థ ఎండీ, సీఈవో Mr. అనూప్ బాగ్చీ తెలిపారు



