బిజినెస్

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ తయారీ కోసం మిడ్‌వెస్ట్ ఎనర్జీ తన గిగావాట్ స్కేల్ తయారీ ప్లాంట్‌ను ప్రారంభించింది

ఇంటిగ్రేటెడ్ సెల్-టు-కంటైనర్ ఉత్పత్తి ద్వారా అధునాతన ఎనర్జీ స్టోరేజ్ తయారీ సామర్థ్యంలో బలపడుతున్న భారత్

హైదరాబాద్: మిడ్‌వెస్ట్ బిజినెస్ హౌస్‌కు చెందిన టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ విభాగమైన ‘మిడ్‌వెస్ట్ ఎనర్జీ’, బెంగళూరులోని తన 1.2 GWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS) తయారీ ప్లాంట్‌లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది.

ఈ ప్లాంట్ సెల్-టు-కంటైనర్ తయారీ సామర్థ్యాలతో ఏర్పాటు చేయబడింది. ఇది వాణిజ్య, పారిశ్రామిక, పునరుత్పాదక ఇంధన మరియు యుటిలిటీ స్థాయి అవసరాలకు ఉపయోగపడేలా బ్యాటరీ మోడ్యూల్స్, ట్రేలు, రాక్‌లు మరియు పూర్తిగా సమగ్రపరచబడిన కంటైనరైజ్డ్ సిస్టమ్స్ ఉత్పత్తిని సాధ్యం చేస్తుంది.

ఆధునిక విద్యుత్ మౌలిక సదుపాయాలలో బ్యాటరీ స్టోరేజ్ ఒక ముఖ్యమైన భాగంగా మారుతున్న తరుణంలో, ఈ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావడం అనేది మిడ్‌వెస్ట్ ఎనర్జీ తన సామర్థ్యాలను విస్తరించుకునే ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది.

పునరుత్పాదక ఇంధన వినియోగం వేగవంతమవుతున్నందున మరియు గ్రిడ్ సౌలభ్యం మరింత ముఖ్యంగా మారుతున్న నేపథ్యంలో, నమ్మకమైన విద్యుత్ సరఫరా, పునరుత్పాదక ఇంధన అనుసంధానం మరియు ఇంధన స్థిరత్వానికి మద్దతు ఇవ్వడంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు.

ప్లాంట్ ముఖ్యాంశాలు

• ఏడాదికి 1.2 GWh తయారీ సామర్థ్యం
• సమగ్ర సెల్-టు-కంటైనర్ (Cell-to-Container) తయారీ
• 3 kWh నుండి 6 MWh (48V–1500V) వరకు విస్తృత సామర్థ్య పరిధి
• వాణిజ్య, పారిశ్రామిక, పునరుత్పాదక మరియు యుటిలిటీ రంగాలలో వినియోగం
• అధునాతన నాణ్యతా ప్రమాణాలు, ట్రాకింగ్ (Traceability) మరియు ఎండ్-ఆఫ్-లైన్ టెస్టింగ్
• UL 1973, UL 9540 మరియు UL 9540A ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు
• వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా మార్చుకునే (Customised) పరిష్కారాలు

చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ Quote

మిడ్‌వెస్ట్ ఎనర్జీ లిమిటెడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సౌమ్య కె మాట్లాడుతూ: “పునరుత్పాదకత, సుస్థిరత, డీకార్బనైజేషన్ మరియు వికేంద్రీకరణ లక్ష్యాలతో భారత్ వేగవంతమైన స్వచ్ఛమైన ఇంధన రంగానికి మారుతోంది. ఈ లక్ష్యాలను సాధించడంలో విద్యుత్ గ్రిడ్‌లోకి పునరుత్పాదక ఇంధనాన్ని మరింత ఎక్కువగా అనుసంధానించడం అనేది అత్యంత కీలకం. అదే సమయంలో, ఇది డిమాండ్-సప్లై వ్యత్యాసం, గ్రిడ్ అస్థిరత మరియు సరఫరాలో అనిశ్చితి వంటి సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) ఈ సవాళ్లను పరిష్కరించడానికి మరియు ఒక బలమైన, స్థిరమైన మరియు కార్బన్ రహిత ఇంధన వ్యవస్థను రూపొందించడానికి ఒక నమ్మకమైన, ప్రభావవంతమైన మరియు వేగంగా ఏర్పాటు చేయగల పరిష్కారాన్ని అందిస్తాయి. ఈ ప్లాంట్ ద్వారా, పూర్తిగా భారత్‌లోనే రూపుదిద్దుకుని, తయారైన అధునాతన ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాలను రూపకల్పన చేయడానికి, తయారు చేయడానికి మరియు విస్తరించడానికి మేము స్వదేశీ సామర్థ్యాలను నిర్మిస్తున్నాము. దేశంలో జరుగుతున్న స్వచ్ఛమైన ఇంధన మార్పునకు మద్దతు ఇవ్వడంలో ఒక నమ్మకమైన సుదీర్ఘ భాగస్వామిగా మారడమే మా లక్ష్యం” అని అన్నారు.

వివిధ రకాల కస్టమర్ అవసరాలకు అనుగుణంగా మార్చుకోగల ఎనర్జీ స్టోరేజ్ పరిష్కారాల పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తూనే, దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్‌లలో అధునాతన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌లను సరఫరా చేయడంపై మిడ్‌వెస్ట్ ఎనర్జీ దృష్టి సారిస్తుంది.

ఈ ప్లాంట్ నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, విస్తరించడానికి వీలైన తయారీ సామర్థ్యం, అధిక ఉత్పత్తుల విశ్వసనీయత మరియు అంతర్జాతీయ ప్రమాణాలకు సరితూగే నాణ్యతను అందించేలా రూపకల్పన చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *