బిజినెస్

LGBTQ+ ప్రతిభావంతులకు గోద్రెజ్ క్యాపిటల్‌లో ఉద్యోగ అవకాశాలు

LGBTQ+ కమ్యూనిటీకి చెందిన టెక్ నిపుణుల కోసం గోద్రెజ్ క్యాపిటల్ ఒక సురక్షితమైన వేదికను కల్పించింది. 'ప్రైడ్ ఇన్ టెక్' హ్యాకథాన్ ద్వారా కేవలం నైపుణ్యం ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది.

హైదరాబాద్: LGBTQ+ కమ్యూనిటీకి చెందిన టెక్ నిపుణుల కోసం గోద్రెజ్ క్యాపిటల్ ఒక సురక్షితమైన వేదికను కల్పించింది. ‘ప్రైడ్ ఇన్ టెక్’ హ్యాకథాన్ ద్వారా కేవలం నైపుణ్యం ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్ టెక్నికల్ టెస్ట్, కోడింగ్ సవాళ్ల ద్వారా అభ్యర్థుల సామర్థ్యాన్ని అంచనా వేశారు.

ఈ ప్రక్రియలో ఎంపికైన వారికి ఉద్యోగాలతో పాటు నగదు బహుమతులను కూడా అందించారు. కెరీర్ ప్రారంభంలో ఈ కమ్యూనిటీ ఎదుర్కొనే ఆటంకాలను తొలగించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *