బిజినెస్

తమ సంస్థలో మహిళా ప్రాతినిధ్య లక్ష్యాన్ని 35 శాతానికి పెంచిన వేదాంత

సహజ వనరుల రంగంలోకి మహిళలను ఆహ్వానిస్తూ వేదాంత #HerAtTheCore అనే ప్రచారాన్ని ప్రారంభించింది.

న్యూఢిల్లీ 6 మార్చి 2026: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేదాంత గ్రూప్ తమ సంస్థలోని అన్ని స్థాయిలలో మహిళా ప్రాతినిధ్యాన్ని 35 శాతానికి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా #HerAtTheCore అనే దేశవ్యాప్త ప్రచారాన్ని, లింక్డిన్ (LinkedIn) ఆధారిత హైరింగ్ డ్రైవ్‌ను ప్రారంభించింది. మైనింగ్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, టెక్నాలజీ రంగాలలో కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకునే మహిళలను దీని ద్వారా ఆహ్వానిస్తోంది.

పరిశ్రమల ప్రస్తుత గణంకాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన వెలువడింది. భారతదేశంలోని యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రకారం, 2023–24లో అన్ని పరిశ్రమలలో ప్రత్యక్ష ఉపాధిలో మహిళల వాటా సుమారు 18% గా ఉంది. అయితే మైనింగ్ , మెటల్స్ వంటి కోర్ రంగాలలో వారి వాటా కేవలం 6% మాత్రమే ఉంది.

HerAtTheCore ప్రచారం భారతదేశ పారిశ్రామిక వృద్ధిలో ఒక నిర్ణయాత్మక దశాబ్దంలోకి అడుగుపెడుతోందనే వాస్తవాన్ని నొక్కి చెబుతోంది. ప్రపంచ ఇంధన పరివర్తనకు (ఎనర్జీ ట్రాన్సిషన్) శక్తినివ్వడం, ఈవీ సరఫరా గొలుసులను నిర్మించడం , అధునాతన తయారీ, సాంకేతిక రంగాలలో తన పాత్రను బలోపేతం చేసుకోవడం వంటి అంశాలను ఇది వివరిస్తోంది. ఈ పరిశ్రమల వృద్ధికి లోహాలు, ఖనిజాలు, ఆయిల్ అండ్ గ్యాస్, విద్యుత్ రంగాలు చాలా కీలకం. అయినప్పటికీ, భవిష్యత్తును నిర్మించే ఈ కోర్ రంగాలలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 6 శాతం మాత్రమే ఉంది. భారతదేశ ఆర్థిక ఆకాంక్షలు నెరవేరాలంటే, ఆ పురోగతికి కారణమయ్యే పరిశ్రమలు దేశంలోని పూర్తి స్థాయి ప్రతిభావంతుల శక్తిని ప్రతిబింబించాలి.

వేదాంతలో ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం 23 శాతంగా ఉంది. ఇది పరిశ్రమ సగటు కంటే గణనీయంగా ఎక్కువ. “6 శాతం ఏమాత్రం సరిపోదు. 23 శాతం అనేది కేవలం ఆరంభం మాత్రమే” అనే సందేశంతో సాగుతున్న #HerAtTheCore ప్రచారం, పరిశ్రమలో ఉన్న అంతరాన్ని, కోర్ పరిశ్రమల భవిష్యత్తు వర్క్‌ఫోర్స్‌ను పునర్నిర్మించే అవకాశాన్ని నొక్కి చెబుతోంది.

ఈ చొరవ గురించి వేదాంత లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ చైర్‌పర్సన్ ప్రియా అగర్వాల్ హెబ్బార్ మాట్లాడుతూ.. “భారతదేశ వృద్ధి ఆకాంక్షలకు దేశంలోని ప్రతిభావంతులందరి పూర్తి భాగస్వామ్యం అవసరం. వేదాంతలో ప్రస్తుతం మహిళల ప్రాతినిధ్యం 23 శాతంగా ఉంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. మా లక్ష్యం ఈ ప్రాతినిధ్యాన్ని 35 శాతం నుంచి చివరికి 50 శాతానికి పెంచడమే. మేం కేవలం సంఖ్యను పెంచడం మాత్రమే కాకుండా.. కోర్ పరిశ్రమలలో మహిళలు రాణించేలా వ్యవస్థలను పునర్నిర్మించడం, అధునాతన సాంకేతికతలను అందుబాటులోకి తీసుకురావడం, జీవితంలోని వివిధ దశల్లో వారికి అవసరమైన తోడ్పాటును అందించే ఫ్రేమ్‌వర్క్‌లను నిర్మిస్తున్నాం. #HerAtTheCore అనేది ఒక వేడుక మాత్రమే కాదు. ఇదొక పిలుపు. ప్రతిభావంతులైన మహిళలు ప్రపంచానికి శక్తినిచ్చే ఈ రంగాల్లో భాగస్వాములు కావాలి” అని పేర్కొన్నారు.

సమానత్వానికి సాధనంగా సాంకేతికత
వేదాంత సమగ్ర వృద్ధి వ్యూహంలో (ఇన్‌క్లూజన్ స్ట్రాటజీ) సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తోంది. లింగభేదం కంటే సామర్థ్యానికే పెద్దపీట వేసేలా, అధునాతన సాంకేతికతను ఉపయోగించి సురక్షితమైన, నైపుణ్య ఆధారిత పని ప్రదేశాలను సంస్థ నిర్మిస్తోంది. నేడు మైనింగ్ , మెటల్స్ కార్యకలాపాలు ఎక్కువగా మేధోపరమైనవిగా మారుతున్నాయి. ఇందులో ఇంజినీర్లు డిజిటల్ వ్యవస్థలు , రియల్ టైమ్ అనలిటిక్స్ ద్వారా సంక్లిష్టమైన ప్రక్రియలను నిర్వహిస్తున్నారు. బరువైన పనులను అధునాతన యంత్రాలు , యాంత్రిక పరికరాలు (మెకనైజ్డ్ ఎక్విప్‌మెంట్) పూర్తి చేస్తున్నాయి. ఆటోమేషన్, డిజిటల్ ఆపరేషన్స్ సెంటర్లు , రిమోట్ మానిటరింగ్ వంటివి పురుషులు , మహిళలకు సమానమైన పని వాతావరణాన్ని కల్పించాయి.

కోర్ ఆపరేషన్లలో అడ్డంకులను అధిగమించడం
కోర్ పరిశ్రమలలోని ఫ్రంట్‌లైన్ పారిశ్రామిక పాత్రలలో మహిళలకు అవకాశాలు కల్పించడంలో వేదాంత అగ్రగామి పాత్ర పోషించింది:

ఒడిశాలోని ఝార్సుగూడలో ఉన్న వేదాంత అల్యూమినియం విభాగంలో — ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం స్మెల్టర్ — పూర్తిగా మహిళా బృందమే ఒక పూర్తి అల్యూమినియం ప్రొడక్షన్ లైన్ (పాట్‌లైన్)ను నడుపుతోంది. వీరు అత్యంత కచ్చితత్వంతో కూడిన స్మెల్టింగ్ కార్యకలాపాలను స్వయంగా నిర్వహిస్తున్నారు.

విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మహిళలు ప్రత్యేక సాంకేతిక పాత్రలను పోషిస్తున్నారు. వాస్తవానికి, కీలకమైన ప్లాంట్ కార్యకలాపాలకు మద్దతుగా లోకోమోటివ్, భద్రతా కార్యకలాపాలను(సేఫ్టీ ఆపరేషన్స్)పూర్తిగా మహిళల నేతృత్వంలోని బృందాలే నిర్వహిస్తున్నాయి.

2019లో భారత ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ జింక్ ఉత్పత్తిదారు అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ తమ భూగర్భ గనులలో (అండర్ గ్రౌండ్ మైనింగ్) మహిళా ఇంజినీర్లను నియమించింది. భారతదేశంలో సంప్రదాయకంగా పురుషాధిక్యత కలిగిన మైనింగ్ రంగంలో ఇది ఒక చారిత్రాత్మక మార్పుగా నిలిచింది.

బలోపేతం చేసిన భద్రతా వ్యవస్థలు, సురక్షితమైన రవాణా సౌకర్యాలతో మహిళలు అన్ని విభాగాలలో నైట్ షిఫ్టులలో కూడా పనిచేస్తున్నారు. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్‌కు(Cairn Oil & Gas) చెందిన మంగళ ప్రాసెసింగ్ టెర్మినల్‌లో మహిళలు 2019 నుండి నైట్ షిఫ్టులలో పని చేస్తూ, 24/7 కొనసాగే సంక్లిష్టమైన హైడ్రోకార్బన్ ప్రాసెసింగ్ వ్యవస్థలను నిర్వహిస్తున్నారు.

హిందుస్థాన్ జింక్ లిమిటెడ్‌కు చెందిన నాలుగు మహిళా అండర్ గ్రౌండ్ మైన్ రెస్క్యూ టీమ్‌లు — ఇవి భారతదేశంలోనే మొదటివి — అంతర్జాతీయ పోటీలలో దేశానికి ప్రాతినిధ్యం వహించాయి. అదే సమయంలో జాంబియాలోని కొంకోలా కాపర్ మైన్స్ నచాంగా లేడీస్ మైన్ రెస్క్యూ టీమ్‌కు(Nchanga Ladies Mine Rescue Team) శిక్షణ ఇచ్చింది. ఇది ఆ కంపెనీలోనే కాకుండా ఆ దేశంలోనే మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని రెస్క్యూ యూనిట్.

దక్షిణాఫ్రికాలోని వేదాంత జింక్ ఇంటర్నేషనల్‌లో మహిళలు మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 23 శాతంగా ఉన్నారు. ఇది ఆ దేశ మైనింగ్ పరిశ్రమ సగటు కంటే 3.2 శాతం ఎక్కువ. బ్లాక్ మౌంటైన్ వద్ద ప్రత్యేక చనుబాలిచ్చే గదులు (లాక్టేషన్ రూమ్స్), ఒంటరి తల్లులకు గృహ కేటాయింపులు , గామ్స్‌బర్గ్ గనిలో గర్భిణీలకు అనువైన ప్రత్యేక రక్షణ పరికరాలను (మెటర్నిటీ పీపీఈ) ప్రవేశపెట్టడం వంటి కార్యక్రమాలు వీరికి అండగా నిలుస్తున్నాయి.

జీవితంలోని వివిధ దశల్లో మహిళలకు తోడ్పాటు

కేవలం రిక్రూట్‌మెంట్ మాత్రమే కాకుండా, మహిళలు దీర్ఘకాలం పాటు సంస్థలో కొనసాగేలా , వృద్ధి చెందేలా వేదాంత ఈ క్రింది అంశాలపై దృష్టి సారిస్తోంది:

  • ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి విధుల్లో చేరడానికి వ్యవస్థీకృత రిటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు.

సరళమైన పని ఒప్పందాలు (ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్‌మెంట్స్), అందరికీ అనువైన షిఫ్ట్ విధానాలు.

మారుమూల ప్రాంతాలలో పనిచేసే ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే పాలసీలు.

అధిక సామర్థ్యం ఉన్న మహిళా ఉద్యోగుల కోసం లీడర్‌షిప్ యాక్సిలరేషన్ ట్రాక్స్ (నాయకత్వ శిక్షణలు).

నాణ్యమైన గృహ వసతి, వైద్యం, విద్య, శిశు సంరక్షణ (చైల్డ్‌కేర్), క్రీడా మౌలిక సదుపాయాలు , చైతన్యవంతమైన సామాజిక జీవనాన్ని అందించే ప్రపంచ స్థాయి ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల సౌకర్యం.

ప్రచారం నుండి కెరీర్ వైపు
సోషల్ మీడియాలో వేగంగా ప్రాచుర్యం పొందుతున్న #HerAtTheCore ప్రచారం ద్వారా వేదాంత లిమిటెడ్ తన వ్యాపార విభాగాలలో వివిధ హోదాల్లో పని చేయడానికి మహిళా ఇంజినీర్లు, జియాలజిస్టులు, డేటా సైంటిస్టులు, ఆపరేటర్లు, నాయకులను ఆహ్వానిస్తోంది.

ఆదర్శవంతమైన మహిళా రోల్ మోడళ్లను చూపించడంతో పాటు చురుకైన నియామక ప్రక్రియను చేపట్టడం ద్వారా, కోర్ రంగాలు మారుతున్నాయని , భారతదేశ పారిశ్రామిక భవిష్యత్తులో మహిళలే కీలకం అనే సంకేతాన్ని వేదాంత పంపుతోంది.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *