సంతానోత్పత్తిపై అవగాహన పెంచడానికి రాజమండ్రికి చేరుకున్న ఓయాసిస్ ఫెర్టిలిటీ జనని యాత్ర.
ఈ దేశవ్యాప్త ఉద్యమం నిపుణుల సలహాలను, ఉచిత సంతానోత్పత్తి పరీక్షలను మరియు సైన్స్ ఆధారిత మార్గదర్శకాలను నేరుగా ప్రజల వద్దకే తీసుకువస్తోంది.

రాజమండ్రి: సంతానోత్పత్తి వైద్య విభాగంలో భారతదేశపు నమ్మకమైన సంస్థ అయిన ఓయాసిస్ ఫెర్టిలిటీ, గత 5 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో తన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పుడు దేశవ్యాప్త సంతానోత్పత్తి అవగాహన ఉద్యమం ‘ఓయాసిస్ జనని యాత్ర’ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చేరుకుంది. ఈ చొరవ ద్వారా టైర్ 1, 2, 3 నగరాల్లోని ప్రజలకు సంతానోత్పత్తిపై అవగాహన, నిపుణుల మార్గదర్శకత్వం, ప్రాథమిక స్క్రీనింగ్ పరీక్షలను నేరుగా ఆయా ప్రాంతాల్లోనే అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా సంతానలేమి సమస్యలపై అవగాహన కల్పించడమే కాకుండా దంపతులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించనుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. అవసరమైన సంతానోత్పత్తి ఆరోగ్య విద్యను కుటుంబాలకు మరింత దగ్గర చేయడంలో మరియు సమాజంలో ఆరోగ్య అవగాహనను బలోపేతం చేయడంలో ఓయాసిస్ ఫెర్టిలిటీ చేస్తున్న కృషిని వారు ఈ సందర్భంగా అభినందించారు. దీని ద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు.
జీవనశైలి మార్పులు, ఆలస్యంగా సంతానం కోసం ప్రయత్నించడం, శాస్త్రీయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల సంతానలేమి సవాళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఓయాసిస్ జనని యాత్ర బస్సు ద్వారా ఉచిత సంతానోత్పత్తి సంప్రదింపులు, ఉచిత ఏఎంహెచ్ (AMH) & హిమోగ్లోబిన్ పరీక్షలు మరియు ఉచిత వీర్య కణాల విశ్లేషణ వంటి సేవలను అందిస్తున్నారు. సురక్షితమైన, పరిశుభ్రమైన నమూనా సేకరణ జోన్ల ద్వారా దంపతులకు ప్రాథమిక దశలోనే కచ్చితమైన, సానుభూతితో కూడిన మార్గదర్శకత్వాన్ని ఈ యాత్ర నిర్ధారిస్తోంది. రాజమండ్రి నుండి ఈ ఓయాసిస్ జనని యాత్ర రాబోయే రోజుల్లో జగ్గంపేట, దేవరపల్లి, రావులపాలెం, ఇతర ప్రాంతాలకు తరలనుంది. తద్వారా మరిన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ఈ అవగాహనను, ప్రాథమిక స్క్రీనింగ్ మద్దతును చేరవేసి వారిలో భరోసాను కల్పించనుంది.
రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “8 రాష్ట్రాల్లో దేశవ్యాప్త పర్యటనను ముగించుకుని ఓయాసిస్ జనని యాత్ర తన లక్ష్యాన్ని కొనసాగించడానికి తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోవడం సంతోషం. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) తగ్గుముఖం పడుతున్న తరుణంలో, అవగాహన కల్పించడం, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారానే ఈ సమస్యను ఎదుర్కోగలం. శాస్త్రీయ దృక్పథంతో, సానుభూతితో ప్రజల వద్దకు చేరుతున్న ఈ యాత్ర, కుటుంబ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకునేలా ప్రోత్సహిస్తూ, వారి హృదయాలను గెలుచుకుంటోంది” అని ఆయన ప్రశంసించారు.
ఓయాసిస్ ఫెర్టిలిటీ మెడికల్ డైరెక్టర్, కో-ఫౌండర్ డాక్టర్ దుర్గా జి.రావు మాట్లాడుతూ.. “సంతానోత్పత్తి విజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఓయాసిస్ జనని యాత్ర అత్యాధునిక, సాక్ష్యాధారిత సంతానోత్పత్తి సంరక్షణ సమాచారాన్ని సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరువ చేస్తోంది. ఇప్పటికే ఈ యాత్ర దేశవ్యాప్తంగా వందలాది మందిని చేరుకుంది. ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు తగ్గుతున్న తరుణంలో, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కుటుంబాలకు మద్దతుగా ప్రగతిశీల చర్యలు చేపడుతున్నాయి. ముఖ్యంగా దంపతులను రెండు లేదా ముగ్గురు పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్న ఈ సమయంలో, సకాలంలో అవగాహన కల్పించడం, సరైన వైద్య మార్గదర్శకత్వం అందుబాటులో ఉండటం మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. దంపతులకు ప్రాథమిక దశలోనే వైద్య మార్గదర్శకత్వాన్ని అందించడం ద్వారా, వారు తల్లిదండ్రులు కావాలనే తమ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది” అని వివరించారు.
ఓయాసిస్ ఫెర్టిలిటీ సీఈఓ పుష్కరాజ్ షెనాయ్(Pushkaraj Shenai) మాట్లాడుతూ.. “భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉన్నందున అందుబాటులో ఉండే మరియు సకాలంలో లభించే సంతానోత్పత్తి సంరక్షణ గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యం. ఓయాసిస్ జనని యాత్ర ద్వారా మేం నిపుణుల కౌన్సెలింగ్, ప్రాథమిక రోగనిర్ధారణ పరీక్షలు మరియు క్షేత్రస్థాయిలో సరైన మద్దతుతో గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్ ప్రభావాన్ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు మేము మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. తద్వారా సంతానం కోరుకునే దంపతులు తమ తదుపరి అడుగుల గురించి సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకోగలరు” అని పేర్కొన్నారు.
ఓయాసిస్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ గంగా ప్రియదర్శిని మాట్లాడుతూ, “మేము ఈ ఓయాసిస్ జనని యాత్రను ప్రారంభించి దాదాపు ఏడాది కావస్తోంది మరియు దీనికి లభించిన స్పందన చాలా అద్భుతంగా ఉంది. దంపతులు సరైన మార్గదర్శకత్వానికి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ఇది స్పష్టంగా తెలియజేస్తోంది. సంతానోత్పత్తి సమస్యలు మరియు అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సల గురించి అవగాహన లేక ఇంకా ఇబ్బందులు పడుతున్న స్థానిక ప్రజలకు, సకాలంలో సమాచారం మరియు సానుభూతితో కూడిన మద్దతును అందించాలని మేము ఆశిస్తున్నాము” అని తెలిపారు.


