మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైదరాబాద్‌లో ‘ఆర్టిస్ట్రి స్టోర్’ ఆవిష్కరణ
మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ రోడ్ నం. 10 వద్ద తన ‘ఆర్టిస్ట్రి స్టోర్’ను ఆవిష్కరించింది.

హైదరాబాద్: మలబార్ గోల్డ్ & డైమండ్స్ హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ రోడ్ నం. 10 వద్ద తన ‘ఆర్టిస్ట్రి స్టోర్’ను ఆవిష్కరించింది. భారతదేశంలోనే ప్రత్యేకమైన క్యూయేటెడ్ లగ్జరీ జ్యువెలరీ డెస్టినేషన్‌గా ఈ స్టోర్‌ను నిలపాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రారంభం ద్వారా వ్యక్తిగత అనుభవం, నైపుణ్యం, ప్రత్యేకత, కన్సల్టేషన్ ఆధారిత సేవలను సమన్వయపరుస్తూ రిటైల్‌లో కొత్త దిశగా అడుగు వేసింది.
ఈ స్టోర్‌ను సినీ నటి కరీనా కపూర్ ఖాన్ ఆవిష్కరించగా, వ్యాపార, లగ్జరీ, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మలబార్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ ఎం. పి. అహమ్మద్, మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆశర్ ఓ, రిటైల్ హెడ్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) శ్రీ సిరాజ్ పి. కె., హైదరాబాద్ జోనల్ హెడ్ శ్రీ మహమ్మద్ షరీజ్ కె. హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, “జ్యువెలరీ రిటైల్‌లో మరింత క్యూయేటెడ్ మరియు రిలేషన్షిప్ ఆధారిత విధానానికి మేము మారుతున్నాం. వినియోగదారుల అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో వ్యక్తిగత అనుభవం, నైపుణ్యం, విశ్వాసం కీలకంగా మారాయి. ఈ స్టోర్ వాటిని ప్రతిబింబించేలా రూపుదిద్దుకుంది. నాణ్యత, పారదర్శకత, దీర్ఘకాలిక విలువల పట్ల మా నిబద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది” అని తెలిపారు.
కరీనా కపూర్ ఖాన్ మాట్లాడుతూ, “జ్యువెలరీ అనేది ఇప్పుడు చాలా వ్యక్తిగతమైనది. అది వ్యక్తిత్వం, జీవిత ఘట్టాలు, వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రతి అంశంలోనూ వినియోగదారుడి అనుభవానికి ఇచ్చిన ప్రాధాన్యత ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇది నిజంగా ఆలోచనాత్మకమైన, లగ్జరీ అనుభూతిని ఇస్తుంది” అని చెప్పారు.
సుమారు 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్, ప్రైవసీ, వ్యక్తిగతీకరణ, లోతైన అనుభవం కోరుకునే వినియోగదారుల కోసం హై-టచ్ లగ్జరీ వాతావరణంగా రూపొందించబడింది.
దేశంలోని అత్యంత ప్రత్యేకమైన జ్యువెలరీ రిటైల్ కాన్సెప్ట్‌లలో ఒకటిగా ఇది నిలుస్తోంది. ప్రపంచ స్థాయి నైపుణ్యం, క్యూయేటెడ్ డిజైన్స్, ఇమర్సివ్ షాపింగ్ అనుభవాన్ని ఒకే చోట అందిస్తూ, ట్రాన్సాక్షన్ ఆధారిత రిటైల్ నుంచి రిలేషన్షిప్ ఆధారిత అనుభవానికి మలబార్ గోల్డ్ & డైమండ్స్ మలుపుతిప్పుతోంది.



