పెడిగ్రీ బ్రాండ్ తమ గ్రేవీ ఉత్పత్తులను మరింత చేరువ చేసేందుకు భారత క్రికెటర్ జెమిమా రోడ్రిగ్స్‌తో జతకట్టింది.
ఈ ప్రచారం కుక్కలకు పెట్టే వెట్ (గ్రేవీ) ఫుడ్ అనేది ప్రతిరోజూ ఇవ్వదగ్గ సంపూర్ణ ఆహారమని వివరిస్తోంది. భారత్‌లో పెరుగుతున్న పెంపుడు జంతువుల యజమానులు తమ కుక్కల కోసం ఈ గ్రేవీ ఆహారాన్నే మొదటి ఎంపికగా చేసుకోవాలని ఈ ప్రచారం ప్రోత్సహిస్తోంది.

హైదరాబాద్, 24 ఏప్రిల్, 2026: మార్స్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ భారత క్రికెటర్ మరియు పెట్ పేరెంట్ అయిన జెమిమా రోడ్రిగ్స్‌తో(Jemimah Rodrigues) కలిసి పెడిగ్రీ (PEDIGREE®) బ్రాండ్ కోసం సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్‌ను ఇవాళ ప్రకటించింది. ప్రస్తుత ఆధునిక యుగంలో పెంపుడు జంతువుల పెంపకంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రచారాన్ని రూపొందించారు. కుక్కలకు ఇష్టమైన రుచితో పాటు, వాటికి అవసరమైన సరైన పోషకాహారాన్ని అందించడంపై ఈ క్యాంపెయిన్ అవగాహన కల్పిస్తుంది. ఎనిమిది కోడి కాలేయాల్లో(chicken livers) ఉండే ప్రొటీన్‌తో సమానమైన శక్తిని అందించడంతో పాటు, సూచించిన విధంగా ఇస్తే ఇది 100 శాతం సంపూర్ణ, సమతుల ఆహారంగా నిలుస్తుంది. పెడిగ్రీ గ్రేవీ పెంపుడు జంతువులకు రుచికరమైన, పుష్టికరమైన ఆహారం.
ఒక బాధ్యతాయుతమైన పెట్ పేరెంట్‌గా, భారతదేశపు ప్రముఖ యువ క్రీడాకారిణిగా జెమిమా తన క్రమశిక్షణ, ఉత్సాహం మరియు పనితీరుతో గుర్తింపు పొందింది. ఈ ప్రచారంలో ఆమె కేవలం ఒక క్రికెటర్‌గానే కాకుండా, తన పెంపుడు జంతువుల ఆహార విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎంత ముఖ్యమో తెలిసిన ఒక యజమానిగా తన గళాన్ని వినిపించింది.
పెడిగ్రీ గ్రేవీని ప్రతిరోజూ పెట్టదగ్గ ఆహారంగా వాల్తామ్ పెట్‌కేర్ సైన్స్ ఇన్స్టిట్యూట్(Waltham Petcare Science Institute) ధృవీకరించింది. ఇది భారత్‌లోని వెట్ ఫుడ్ విభాగంలో మార్స్ పెట్ న్యూట్రిషన్ సంస్థకు ఉన్న తిరుగులేని గుర్తింపును చాటిచెబుతోంది. దశాబ్దాల అంతర్జాతీయ పరిశోధనలను మన దేశంలోని ఆహార అలవాట్లకు అనుగుణంగా మార్చడం ద్వారా, ఇంట్లో వండే ఆహారంతో పాటు ఈ సమతుల పోషకాహారాన్ని ఇవ్వడం పట్ల యజమానులకు ఈ బ్రాండ్ సులభంగా అవగాహన కల్పిస్తోంది.
క్రికెట్ నేపథ్యంతో జెమిమా రోడ్రిగ్స్ నటించిన వీడియోల ద్వారా ఈ ప్రచారాన్ని రూపొందించారు. పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ వీడియోలు ప్రతిబింబిస్తాయి. ప్రతిరోజూ పెట్టే ఆహారంలో పెడిగ్రీ గ్రేవీని చేర్చడం ద్వారా ఆ సమయాన్ని మరింత సరదాగా మరియు ప్రేమతో కూడినదిగా ఎలా మార్చుకోవచ్చో ఈ ప్రచారం చూపిస్తుంది.
ఈ సందర్భంగా మార్స్ పెట్ న్యూట్రిషన్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయేషా హుడా మాట్లాడుతూ.. “భారత్‌లో శునకాల కోసం గ్రేవీ ఆహార విభాగాన్ని పరిచయం చేయడంలో మార్స్ పెట్ న్యూట్రిషన్ కీలక పాత్ర పోషించింది. వాల్తామ్ పెట్‌కేర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ చేసిన దశాబ్దాల పరిశోధనల సహాయంతో, వెట్ ఫుడ్ అనేది మన దేశంలోని శునకాల ఆహార అలవాట్లకు సరిపోయే ఒక సంపూర్ణ పోషకాహార ఎంపిక అనే అవగాహనను మేము తీసుకురాగలిగాము. పెంపుడు జంతువుల యజమానుల ఆలోచనల్లో మార్పు వస్తున్నప్పటికీ, వారి రోజువారీ ఆహార పద్ధతుల్లో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. ముఖ్యంగా కేవలం ఇంట్లో వండే ఆహారంపైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల జంతువులకు అందాల్సిన పూర్తి పోషకాలు అందకపోవచ్చు. పెడిగ్రీ గ్రేవీ ద్వారా మేం అద్భుతమైన రుచితో పాటు సమతుల పోషకాహారాన్ని అందిస్తున్నాం. దీనివల్ల యజమానులు తమ పెంపుడు జంతువుల కోసం సరైన ఆహారాన్ని ఎంచుకోవడం మరింత సులభం, వారి రోజువారీ అలవాటుగా మారుతుంది.” అని పేర్కొన్నారు.
జెమిమా రోడ్రిగ్స్ తన అభిప్రాయాన్ని పంచుకుంటూ.. “ఒక పెట్ పేరెంట్‌గా పెంపుడు జంతువుల సంరక్షణ అంటే కేవలం ఆహారం పెట్టడమే కాదు, వాటికి ఏది సరైనదో తెలుసుకోవడం కూడా అని నేను ఎప్పుడూ నమ్ముతాను. క్రికెట్లో సరైన పోషకాహారం మన ప్రదర్శనకు ఎలా తోడ్పడుతుందో, మన పెంపుడు జంతువుల విషయంలో కూడా అదే వర్తిస్తుందని నేను గ్రహించాను. పెడిగ్రీ గ్రేవీలో నాకు నచ్చిన విషయం ఏమిటంటే, నా పెంపుడు జంతువు ‘జేడ్'(Jade) దీనిని ఎంతో ఇష్టంగా తింటుంది. అదే సమయంలో దీని ద్వారా దానికి పూర్తి పోషకాలు అందుతున్నాయని నాకు తెలుసు. పెంపుడు జంతువుల యజమానులకు తమ పెంపుడు జంతువులతో ఉండే చిన్న చిన్న సంతోషకరమైన క్షణాలను ఈ ప్రచారం ప్రతిబింబిస్తుంది.” అని అన్నారు.
ఈ ప్రచార ప్రారంభం వెనుక మార్స్ సంస్థకు ఒక పెద్ద లక్ష్యం ఉంది. శునకాలకు పెట్టే వెట్ ఫుడ్ అనేది ప్రతిరోజూ ఇవ్వదగ్గ సంపూర్ణ ఆహారమని యజమానులకు అవగాహన కల్పించాలని సంస్థ భావిస్తోంది. శాస్త్రీయంగా తయారైన ఈ ఆహారాన్ని పెంపుడు జంతువుల యజమానులు ఎక్కువగా అలవాటు చేసుకునేలా ప్రోత్సహించడం ద్వారా ఈ విభాగంలో తన పట్టును మరింత పెంచుకోవాలని మార్స్ లక్ష్యంగా పెట్టుకుంది.



