డిజిటల్ క్రియేటర్ల కోసం సాన్‌డిస్క్ సరికొత్త విప్లవం: భారత్‌లో ‘క్రియేటర్ సిరీస్’ స్టోరేజ్ పరికరాలు విడుదల!
భారతదేశంలోని డిజిటల్ కంటెంట్ క్రియేటర్ల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ప్రముఖ బ్రాండ్ సాన్‌డిస్క్ సరికొత్త 'క్రియేటర్ సిరీస్' (Creator Series) స్టోరేజ్ పరికరాలను మార్కెట్లోకి తీసుకువచ్చింది

నేటి ఆధునిక డిజిటల్ యుగంలో కంటెంట్ క్రియేటర్ల సంఖ్య వారు సృష్టించే కంటెంట్ పరిమాణం వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, క్రియేటర్ల నిరంతర అవసరాలను విభిన్న ఫార్మాట్లతో కూడిన సవాళ్లను అధిగమించడానికి ప్రముఖ డేటా స్టోరేజ్ సంస్థ సాన్‌డిస్క్ (SanDisk) సరికొత్త ప్రొఫెషనల్-గ్రేడ్ స్టోరేజ్ సొల్యూషన్స్ శ్రేణి ‘క్రియేటర్ సిరీస్’ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ సరికొత్త సిరీస్ ద్వారా క్రియేటర్లు తమ సృజనాత్మక పనులను ఎంతో వేగంగా, నమ్మకంగా సురక్షితంగా నిర్వహించుకునే వీలు కలుగుతుంది.
ఈ సరికొత్త క్రియేటర్ శ్రేణి అసాధారణ వేగం, గరిష్ట విశ్వసనీయత అద్భుతమైన మన్నికను అందిస్తుంది. హై-రిజల్యూషన్ వీడియో రికార్డింగ్, జెనరేటివ్ ఏఐ (Generative AI) ప్రాజెక్టులు వేగవంతమైన క్రియేటివ్ వర్క్‌ఫ్లోలకు అనువుగా దీనిని తీర్చిదిద్దారు. 4K నాణ్యత గల వీడియోల రికార్డింగ్ మొదలుకొని నిరంతర వర్క్‌ఫ్లోల నిర్వహణ, భారీ ఫైళ్ల సురక్షిత బ్యాకప్ వరకు క్రియేటర్లు తమ డేటాను సులభంగా క్యాప్చర్ చేయడానికి, వేగంగా బదిలీ చేయడానికి సురక్షితంగా రక్షించుకోవడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయి. ఈ నూతన స్టోరేజ్ సొల్యూషన్స్‌తో పాటు అదనపు ప్రయోజనంగా కాంప్లిమెంటరీ ట్రయల్ అడోబ్ (Adobe) సాఫ్ట్వేర్ మెంబర్‌షిప్‌ను కూడా సంస్థ అందిస్తోంది. ఇందులో భాగంగా వినియోగదారులు మూడు నెలల అడోబ్ లైట్‌రూమ్ (Adobe Lightroom) లేదా ఒక నెల అడోబ్ క్రియేటివ్ క్లౌడ్ (Adobe Creative Cloud) సభ్యత్వాన్ని ఉచితంగా పొందే అవకాశం ఉంది.
నేటి తరం క్రియేటర్లు తరచుగా విభిన్న పరికరాలు రకరకాల ఫార్మాట్లతో పని చేయాల్సి వస్తోందని, ఇది చాలాసార్లు వారి పని వేగానికి సవాలుగా మారుతోందని సాన్‌డిస్క్ కంట్రీ మేనేజర్ వైస్ ప్రెసిడెంట్ సుబింద్ కుమార్ తెలిపారు. సాన్‌డిస్క్ క్రియేటర్ సిరీస్ క్రియేటర్లు తమ వర్క్‌ఫ్లోను మరింత మెరుగుపరుచుకోవడంతో పాటు, తమ సృజనాత్మకతను పూర్తిస్థాయిలో ప్రదర్శిస్తూ వేగవంతమైన జీవనశైలికి అనుగుణంగా ముందుకు సాగేందుకు దోహదపడుతుందని, ఈ స్టోరేజ్ పరికరాలు వారి సృజనాత్మక ఆలోచనలను మరింత విస్తరించుకునేలా ప్రోత్సహిస్తాయని ఆయన వెల్లడించారు.
ఈ సరికొత్త క్రియేటర్ సిరీస్‌ను క్రియేటర్లు తీసే ప్రతి షాట్, ప్రతి ఫైల్ బదిలీ, ప్రతి ఎడిటింగ్ సెషన్ ప్రతి బ్యాకప్‌పై పూర్తి నియంత్రణను కలిగి ఉండేలా ఎంతో పకడ్బందీగా రూపొందించారు. ఈ ఉత్పత్తులకు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు సమాచారం కోసం సాన్‌డిస్క్ ఇండియా అధికారిక స్టోర్ వెబ్సైట్ (shop.sandisk.com/en-in/solutions/creator-series) ను సందర్శించవచ్చు.



