జాతీయం

రహావీర్ పథకం కోసం అతిపెద్ద కెప్టెన్ కమ్యూనిటీని సన్నద్ధం చేయడానికి చేతులు కలిపిన రాపిడో, మోర్త్

  • 4 లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు రహావీర్ ప్రతిజ్ఞను (Rahveer Pledge) స్వీకరించి, గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు
  • కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది
  • దేశవ్యాప్తంగా రహావీర్ పథకంపై అవగాహన కల్పించడానికి రాపిడో సంస్థ తన టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను, తన కెప్టెన్ కమ్యూనిటీని ఉపయోగించుకోనుంది

న్యూఢిల్లీ, జూన్ 8, 2026: భారత్‌లోనే అతిపెద్ద, అత్యంత సరసమైన వన్‌-స్టాప్ మొబిలిటీ ప్లాట్‌ఫారమ్ అయిన రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రాపిడో), భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘రహావీర్’ పథకంపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖతో(మోర్త్) చేతులు కలిపినట్లు ఇవాళ ప్రకటించింది. రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో(ప్రమాదం జరిగిన తొలి గంట) సకాలంలో సహాయం అందించడాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని తీసుకువచ్చారు.

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మోర్త్ సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీలతో కూడిన మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు మరియు అరవింద్ సంక,  Co-founder, రాపిడో యాజమాన్యం సమక్షంలో ఈ ఉమ్మడి భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ… “రోడ్డు భద్రత అనేది అందరి ఉమ్మడి బాధ్యత. మన రోడ్లపై జరిగే మరణాలను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకం. రహావీర్ పథకం ద్వారా, ఎలాంటి సంకోచం లేకుండా ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి, గోల్డెన్ అవర్‌లో ప్రాణాలను రక్షించడానికి మేం ప్రజలను ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఈ ముఖ్యమైన జాతీయ కార్యక్రమానికి మద్దతుగా నిలిచినందుకు, దేశవ్యాప్తంగా ఉన్న పౌరులకు ఈ సందేశాన్ని చేరవేయడానికి తన విస్తృతమైన కెప్టెన్ కమ్యూనిటీని, టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకుంటున్నందుకు నేను రాపిడోను అభినందిస్తున్నా” అని అన్నారు.

ఈ భాగస్వామ్యం గురించి రాపిడో కో-ఫౌండర్ అరవింద్ సంక(Aravind Sanka) మాట్లాడుతూ… “ప్రతిరోజూ వివిధ నగరాలు, పట్టణాలలో లక్షలాది మంది భారతీయులు రాపిడో కెప్టెన్లతో ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇది కేవలం రవాణా సేవలు అందించడమే కాకుండా, జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశాలపై అవగాహన పెంచడంలో మా వంతు కృషి చేయడానికి మాకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తుంది. మోర్త్‌తో కుదుర్చుకున్న ఈ భాగస్వామ్యం ద్వారా రహావీర్ పథకానికి మద్దతు ఇవ్వడం, రోడ్డు భద్రతలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచేలా ప్రోత్సహించడం మాకు ఎంతో గర్వంగా ఉంది. మా కెప్టెన్ కమ్యూనిటీ నుండి వచ్చిన అద్భుతమైన స్పందన మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం అనేది.. సురక్షితమైన రోడ్లను నిర్మించడంలో మరియు అత్యవసర సమయాల్లో బాధ్యతాయుతంగా సహాయం చేసే సంస్కృతిని పెంపొందించడంలో మాకున్న ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా రాపిడో సంస్థ దేశవ్యాప్తంగా 400 లకు పైగా నగరాల్లో ఉన్న విస్తృతమైన నెట్‌వర్క్‌ను, భారతదేశంలోనే అతిపెద్దదైన తన మొబిలిటీ కెప్టెన్ కమ్యూనిటీని మరియు అత్యాధునిక టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోనుంది. దీని ద్వారా డిజిటల్ ఎంగేజ్‌మెంట్, ఇన్-యాప్ ఎడ్యుకేషన్, సోషల్ మీడియా క్యాంపెయిన్లు మరియు ఆన్-గ్రౌండ్ ఔట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా రహావీర్ పథకంపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించనుంది.

ఈ భాగస్వామ్య ప్రారంభోత్సవానికి గుర్తుగా.. దేశవ్యాప్తంగా ఉన్న 4 లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు రాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ఏకకాలంలో ఉమ్మడిగా రహావీర్ ప్రతిజ్ఞను స్వీకరించారు. రోడ్డు భద్రతను పెంపొందించడం, బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడం, ప్రమాద బాధితులకు సకాలంలో సహాయం అందించడం పట్ల తమకున్న నిబద్ధతను చాటుతూ వీరంతా గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు.

రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటలో(గోల్డెన్ అవర్) తక్షణ సహాయం అందించడం వల్ల బాధితుల ప్రాణాలు దక్కే అవకాశాలు మరియు వారు త్వరగా కోలుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఇలాంటి కీలక సమయంలో పౌరులు ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు వచ్చి ప్రమాద బాధితులకు సహాయం చేసేలా ప్రోత్సహించడానికి ‘రహావీర్’ పథకాన్ని రూపొందించారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారత్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పౌరులు, ప్రయాణికులు, కెప్టెన్లలో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలని రాపిడో లక్ష్యంగా పెట్టుకుంది.

రాపిడో అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఇన్-యాప్ ఎంగేజ్‌మెంట్, విద్యాసంబంధిత కంటెంట్, కెప్టెన్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు, కీలక మార్కెట్లలో విజిబిలిటీ కార్యక్రమాలతో కూడిన డిజిటల్ మరియు ఆన్-గ్రౌండ్ యాక్టివేషన్లను నిర్వహించనుంది. అంతేకాకుండా కస్టమర్లు మరియు కెప్టెన్లకు సంబంధించిన వివిధ టచ్‌పాయింట్ల వద్ద రోడ్డు భద్రతా సందేశాలను చేర్చడం ద్వారా, రహావీర్ పథకంపై నిరంతర అవగాహన ఉండేలా ఈ కంపెనీ కృషి చేయనుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *