బిజినెస్

ఆర్థిక సమగ్రతకు కొత్త ఊతం: యస్ బ్యాంక్, నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ మధ్య వ్యూహాత్మక ఒప్పందం!

దేశంలో క్రెడిట్ యాక్సెస్ (రుణ సదుపాయం) లేని వెనుకబడిన వర్గాలకు అధికారికంగా రుణాలు అందించడం కోసం ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్, ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ చేతులు కలిపాయి.

దేశంలో క్రెడిట్ యాక్సెస్ (రుణ సదుపాయం) లేని వెనుకబడిన వర్గాలకు అధికారికంగా రుణాలు అందించడం కోసం ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యస్ బ్యాంక్, ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ చేతులు కలిపాయి. ఇరు సంస్థల ఉమ్మడి వాటాదారు అయిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC) చొరవతో ఈ వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వ ‘వికసిత్ భారత్ 2047’ ఆర్థిక సమగ్రత (ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్) లక్ష్యాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా రుణ మార్కెట్‌ను విస్తరించడం ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం.

నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్‌కు ఉన్న 368 ఆరిజినేటర్ పార్ట్‌నర్ల భారీ నెట్‌వర్క్ ఆధారంగా యస్ బ్యాంక్ పెద్ద ఎత్తున నిధులను రుణాల రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. నార్తర్న్ ఆర్క్ యొక్క స్ట్రక్చరింగ్ నైపుణ్యం , యస్ బ్యాంక్ యొక్క బలమైన బ్యాలెన్స్ షీట్ కలయికతో ఈ క్రింది ప్రయోజనాలు చేకూరనున్నాయి:

డిజిటల్ లెండింగ్ విస్తరణ: నార్తర్న్ ఆర్క్ సంస్థకు చెందిన ఎన్‌పోస్ (nPOS) ప్లాట్‌ఫామ్ ఆధారంగా కో-లెండింగ్ (సహ-రుణ) నమూనాను భారీగా విస్తరిస్తారు.

డేటా ఆధారిత అండర్‌రైటింగ్: క్వాలిటీ , పారదర్శకతను కాపాడటానికి డేటా ఆధారిత అండర్‌రైటింగ్ , పక్కా పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ ఫ్రేమ్‌వర్క్‌లను అమలు చేస్తారు.

వెనుకబడిన మార్కెట్లకు సేవలు: ప్రస్తుతం అధికారిక బ్యాంకింగ్ సేవలు , క్రెడిట్ సదుపాయం లేని ప్రాధాన్యతా రకాల కస్టమర్లకు చిన్న మొత్తాల రుణాలను అందుబాటులోకి తెస్తారు.

సాంకేతిక విప్లవం.. ల్యాండ్ మార్క్ ఇంటిగ్రేషన్
ఈ ఒప్పందంలో భాగంగా రెండు సంస్థల డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒకదానితో ఒకటి అనుసంధానిస్తున్నారు. యస్ బ్యాంక్ డిజిటల్ లెండింగ్ ఆర్కిటెక్చర్‌ను నార్తర్న్ ఆర్క్ యొక్క సొంత సాంకేతిక ప్లాట్‌ఫామ్స్ అయిన ఎన్‌పోస్ (nPOS), నింబస్ (NIMBUS) , న్యూస్కోర్ (NuScore) లతో జత చేయనున్నారు. ఇది ఎటువంటి ఇబ్బందులు లేకుండా లోన్ ఆన్‌బోర్డింగ్ ప్రక్రియను , వేగవంతమైన రుణ పంపిణీని సులభతరం చేస్తుంది.

కస్టమర్ల కోసం ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాల విస్తరణ
రుణాల పంపిణీతో పాటు యస్ బ్యాంక్ యొక్క రిటైల్, అఫ్లూయెంట్ , ఇన్స్టిట్యూషనల్ క్లయింట్ల కోసం వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలను ఈ భాగస్వామ్యం మరింత మెరుగుపరుస్తుంది:

ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్: నార్తర్న్ ఆర్క్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ (NAIM) ద్వారా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ (AIFs) , పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (PMS) వంటి సేవలను అందిస్తారు.

డిజిటల్ బాండ్స్ యాక్సెస్: నార్తర్న్ ఆర్క్ ఆన్‌లైన్ బాండ్ ప్లాట్‌ఫామ్ అయిన ‘ఆల్టిఫై’ (Altifi) ను యస్ బ్యాంక్ డిజిటల్ ఎకోసిస్టమ్‌లో విలీనం చేస్తారు. దీనివల్ల కస్టమర్లకు ఫిక్స్‌డ్-ఇన్‌కమ్ పెట్టుబడి సాధనాలలో నేరుగా, పారదర్శకంగా ఇన్వెస్ట్ చేసే అవకాశం లభిస్తుంది.

లీడర్‌షిప్ సందేశాలు
నార్తర్న్ ఆర్క్ క్యాపిటల్ ఎండీ , సీఈఓ ఆశిష్ మెహ్రోత్రా ఈ భాగస్వామ్యంపై మాట్లాడుతూ, రుణ సదుపాయం లేని రుణగ్రహీతలకు , కొత్తగా వస్తున్న ఇన్వెస్ట్టర్లకు మరింత సమర్థవంతమైన, సులభమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ఇరు సంస్థల పరస్పర సామర్థ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.

యస్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజాన్ పెంటల్ మాట్లాడుతూ, సాంకేతికతతో కూడిన క్రెడిట్ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే తమ వ్యూహానికి ఈ భాగస్వామ్యం అద్దం పడుతుందని పేర్కొన్నారు. ఇది ప్రాధాన్యతా రంగాలలో అధికారిక రుణాలను విస్తరించడానికి ఒక శక్తివంతమైన ఇంజిన్‌లా పనిచేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *