బిజినెస్

ది పర్ఫార్మెన్స్ ఇన్‌స్టిట్యూట్’తో యాక్సిస్ బ్యాంక్, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం!

భారత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ కలిసి బెంగళూరు వేదికగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును మొదలుపెట్టాయి

భారత క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో, యాక్సిస్ బ్యాంక్ , గోస్పోర్ట్స్ ఫౌండేషన్ కలిసి బెంగళూరు వేదికగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును మొదలుపెట్టాయి. స్పోర్ట్స్ సైన్స్, అత్యాధునిక పరిశోధనలు , అథ్లెట్ల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ‘ది పర్ఫార్మెన్స్ ఇన్‌స్టిట్యూట్’ (AGTPI)ను ఏర్పాటు చేసేందుకు ఈ రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. దేశ చరిత్రలోనే క్రీడా రంగంలో ఇలాంటి వినూత్నమైన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

ఈ ఇన్‌స్టిట్యూట్ బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్’ (CSE) లో ఏర్పాటు కానుంది. అథ్లెట్ల ప్రతిభను గుర్తించి, వారికి అవసరమైన స్పోర్ట్స్ సైన్స్ , మెడికల్ సపోర్టును అందించడం ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. యాక్సిస్ బ్యాంక్ తన సీఎస్ఆర్ నిధుల ద్వారా వ్యవస్థాపక భాగస్వామిగా వ్యవహరిస్తుండగా, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ దీని నిర్వహణను చూసుకుంటుంది.

AGTPI మూడు ముఖ్యమైన స్తంభాలు:

మానవ వనరుల తయారీ (పీపుల్): శిక్షణ , మెంటార్‌షిప్ ద్వారా స్పోర్ట్స్ సైన్స్ రంగంలో నిపుణులను తయారు చేయడం.

డేటా విశ్లేషణ (అనలిటిక్స్): క్రీడాకారుల సామర్థ్యాన్ని పరీక్షించడం, గాయాల ముప్పును అంచనా వేయడం , బయోమెకానిక్స్ విశ్లేషణ ద్వారా డేటా ఆధారిత ప్రణాళికలను సిద్ధం చేయడం.

పరిశోధన (రీసెర్చ్): దేశీయ పరిస్థితులకు అనుగుణంగా స్పోర్ట్స్ సైన్స్ పరిజ్ఞానాన్ని పెంపొందించడం.

నిపుణుల అభిప్రాయం:
యాక్సిస్ బ్యాంక్ గ్రూప్ హెడ్ విజయ్ ముల్బాగల్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మనం విదేశీ డేటాపైనే ఆధారపడుతున్నామని, ఇకపై మన అథ్లెట్ల అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే బలమైన వ్యవస్థను నిర్మిస్తామని పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటుపై గోస్పోర్ట్స్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ నందన్ కామత్, సీఈఓ సౌగతో బెనర్జీ , సీఎస్ఈ వ్యవస్థాపకుడు వివేక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు , అత్యాధునిక సాంకేతికతను అందించడం ద్వారా భారత క్రీడా భవిష్యత్తును మరింత ఉజ్వలం చేస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *