బిజినెస్

మేడ్చల్‌లో నూతన శాఖను ప్రారంభించిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్!

ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ABHFL), తెలంగాణలో తన సేవా విస్తరణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో కొత్త బ్రాంచ్‌ను అందుబాటులోకి తెచ్చింది

ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (ABHFL), తెలంగాణలో తన సేవా విస్తరణలో భాగంగా తాజాగా హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో కొత్త బ్రాంచ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నూతన శాఖ ఏర్పాటుతో రాష్ట్రంలో సంస్థకు ఉన్న మొత్తం బ్రాంచ్‌ల సంఖ్య 11కి పెరిగింది.

మేడ్చల్ ప్రాంత వృద్ధి:

ఉత్తర హైదరాబాద్‌లో మేడ్చల్ ఒక ముఖ్యమైన రియల్ ఎస్టేట్ కేంద్రంగా మారుతోంది.

జాతీయ రహదారి 44 (NH44)కి అనుసంధానం , పారిశ్రామిక హబ్‌లకు సమీపంలో ఉండటం ఈ ప్రాంతానికి అదనపు బలం.

మెరుగైన వాతావరణం, మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది.

రుణ సదుపాయాలు , ప్రత్యేక ఆఫర్లు:

జీతభత్యాలు పొందే వారు, వ్యాపారవేత్తలు , ఇతర ఆదాయ వర్గాల కోసం సంస్థ ప్రత్యేక గృహ రుణ పథకాలను అందిస్తోంది. ఇందులో అఫోర్డబుల్ హౌసింగ్ లోన్లు, ప్రైమ్ హౌసింగ్ ఫైనాన్స్ , లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (LAP) వంటివి ఉన్నాయి.

శాఖ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా జూలై 14 నుండి జూలై 31, 2026 వరకు కస్టమర్ల కోసం ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్లను సంస్థ ప్రకటించింది.

ఈ కాలంలో లోన్ తీసుకునే వారు జీరో లాగిన్ ఫీజుతో పాటు, రూ. 50 లక్షల వరకు స్పాట్ లోన్ మంజూరు పొందే అవకాశం ఉంటుంది.

ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ ఎండీ , సీఈఓ పంకజ్ గాడ్గిల్ మాట్లాడుతూ, తెలంగాణలో పెరుగుతున్న గృహ రుణాల అవసరాలను తీర్చడానికి తమ సంస్థ డిజిటల్ సామర్థ్యాలను , విస్తృత నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తోందని తెలిపారు. కస్టమర్లకు మరింత సులభతరమైన, వేగవంతమైన ఆర్థిక పరిష్కారాలను అందించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *