బిజినెస్

2026 ‘టీమ్ ఇండియా’ బ్యాంకింగ్ భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో యస్ బ్యాంక్ భాగస్వామ్యం

భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్, 2026 లో జరగనున్న నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే 'టీమ్ ఇండియా' కు అధికారిక రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) కి తమ మద్దతును ప్రకటించింది

ముంబై: భారతదేశపు ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అగ్రగామి అయిన యస్ బ్యాంక్, 2026 లో జరగనున్న నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొనే ‘టీమ్ ఇండియా’ కు అధికారిక రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామిగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) కి తమ మద్దతును ప్రకటించింది. పారిస్ 2024 ఒలింపిక్స్ సందర్భంగా టీమ్ ఇండియాకు అధికారిక బ్యాంకింగ్ భాగస్వామిగా విజయవంతమైన పాత్ర పోషించిన యస్ బ్యాంక్, ఈ చరిత్రాత్మక భాగస్వామ్యం ద్వారా దేశంలో క్రీడల అభివృద్ధికి మరియు యువ క్రీడాకారుల భవిష్యత్తుకు తోడ్పడాలనే తమ దీర్ఘకాలిక నిబద్ధతను పునరుద్ఘాటించింది.

2026 లో జరిగే నాలుగు ప్రధాన అంతర్జాతీయ పోటీలైన కామన్వెల్త్ గేమ్స్ 2026 (గ్లాస్గో, స్కాట్లాండ్), ఆసియన్ గేమ్స్ 2026 (ఐచి-నాగోయా, జపాన్), యూత్ ఒలింపిక్ గేమ్స్ 2026 (డకార్, సెనెగల్) మరియు ఆసియన్ ఇండోర్ & మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2026 (రియాద్, సౌదీ అరేబియా) లలోని 100 కి పైగా క్రీడాంశాలలో భారతీయ అథ్లెట్లకు బ్యాంక్ మద్దతుగా నిలుస్తుంది.

దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే వ్యక్తులను మరియు సంస్థలను ప్రోత్సహించడం ద్వారా సమాజంపై సానుకూల ప్రభావం చూపించాలనే యస్ బ్యాంక్ యొక్క ఆలోచనా విధానానికి ఈ భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వెయిట్‌లిఫ్టింగ్, బాక్సింగ్, జూడో, విలువిద్య (ఆర్చరీ), క్రికెట్, బ్యాడ్మింటన్ మరియు మరిన్ని క్రీడలలో పోటీపడే అవకాశాన్ని కల్పిస్తాయి.
“2026 లో జరగబోయే నాలుగు ప్రధాన అంతర్జాతీయ క్రీడా పోటీలలో టీమ్ ఇండియాకు మద్దతుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌తో జట్టు కట్టడం మాకు ఎంతో గర్వకారణం. దేశాన్ని ఉత్తేజపరచడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, గ్రామీణ స్థాయిలో ప్రతిభను వెలికితీసేందుకు మరియు క్రమశిక్షణ, కృషి, సమిష్టి కృషితో క్రీడాకారుల క్యారెక్టర్‌ను మలచడానికి క్రీడలకు అపారమైన శక్తి ఉంది. వ్యక్తిగతంగా, సామాజికంగా మరియు వ్యాపారపరంగా ప్రతి ఒక్కరినీ సాధికారత వైపు నడిపిస్తూ, దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలనే యస్ బ్యాంక్ లక్ష్యాలకు ఈ విలువలు అద్దం పడతాయి. కోట్లాదిమంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను మోస్తూ టీమ్ ఇండియా ప్రపంచ వేదికపై పోటీపడుతున్న వేళ, మన దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తున్న మన అథ్లెట్ల పక్కన నిలబడటం మాకు లభించిన గౌరవంగా భావిస్తున్నాము” అని యస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ వినయ్ ఎమ్. టోన్సే అన్నారు.

“ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ యొక్క దీర్ఘకాలిక భాగస్వామిగా యస్ బ్యాంక్‌ను స్వాగతించడం మరియు దేశంలో క్రీడల అభివృద్ధికి వారి నిరంతర మద్దతు లభించడం ఎంతో సంతోషంగా ఉంది. 2026 లో జరిగే నాలుగు ప్రధాన క్రీడా పోటీలలో టీమ్ ఇండియాకు యస్ బ్యాంక్ ‘రీటెయిల్ బ్యాంకింగ్ భాగస్వామి’గా వ్యవహరిస్తుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ భాగస్వామ్య స్ఫూర్తితో, ఈ ఒప్పందం ద్వారా క్రీడా రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మేము సిద్ధంగా ఉన్నాము. భారతదేశపు క్రీడా వ్యవస్థను పటిష్టం చేయడంలో మరియు ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేలా మన అథ్లెట్లను సిద్ధం చేయడంలో ఇటువంటి విలువైన భాగస్వామ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. మేమంతా కలిసి మన అథ్లెట్ల విజయాలను వేడుక చేసుకుంటూ, కోట్లాది మంది భారతీయులలో స్పూర్తి నింపుతూ మరియు ‘వికసిత భారత్’ జాతీయ లక్ష్యానికి అనుగుణంగా క్రీడలను అభివృద్ధికి ప్రధాన మూలస్తంభంగా మారుస్తామని ఆశిస్తున్నాము” అని ఈ భాగస్వామ్యాన్ని స్వాగతిస్తూ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ Dr. పి.టి. ఉష తెలిపారు.

రాబోయే ఆరు నెలల్లో, యస్ బ్యాంక్ 17 ఏళ్ల లోపు యువ అథ్లెట్లకు వేదికగా నిలిచే ‘యూత్ ఒలింపిక్ గేమ్స్ 2026’ మరియు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA), వుషు, కిక్‌బాక్సింగ్‌లపై దృష్టి సారించే ‘ఆసియన్ ఇండోర్ అండ్ మార్షల్ ఆర్ట్స్ గేమ్స్ 2026’ తో సహా అనేక ఇన్‌డోర్ మరియు అవుట్‌డోర్ క్రీడా పోటీలకు మద్దతుగా నిలుస్తుంది.
ఆసియా క్రీడలలో పోటీపడేందుకు టీమ్ ఇండియా సిద్ధమవుతున్న తరుణంలో, భారత్ మరియు జపాన్ దేశాల మధ్య ఉన్న దీర్ఘకాలిక సంబంధాలను మరింత బలపరచాలనే యస్ బ్యాంక్ నిబద్ధతను ఈ భాగస్వామ్యం ప్రతిబింబిస్తోంది. ఐఓఏ (IOA) తో కలిసి క్రీడా నైపుణ్యాన్ని చాటడం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేయడం మరియు క్రమశిక్షణ, సమిష్టి కృషి అనే విలువల ద్వారా రాబోయే తరాల భారతీయ అథ్లెట్లలో స్ఫూర్తిని నింపడమే బ్యాంక్ ప్రధాన లక్ష్యం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *