తెలంగాణసంగారెడ్డి

Bankers Strike: సంగారెడ్డిలో బ్యాంకర్ల గర్జన.. 5 రోజుల పని దినాల కోసం సమ్మె

సంగారెడ్డి జిల్లాలో బ్యాంకింగ్ రంగం స్తంభించిపోయింది. 5 రోజుల పని దినాల డిమాండ్‌తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు జనవరి 27న జిల్లావ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు అఖిల భారత బ్యాంక్ సమ్మెలో పాల్గొన్నారు.

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బ్యాంకింగ్ రంగం స్తంభించిపోయింది. 5 రోజుల పని దినాల (5-Day Work Week) డిమాండ్‌తో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపు మేరకు జనవరి 27న జిల్లావ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు అఖిల భారత బ్యాంక్ సమ్మెలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో బ్యాంక్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రధాన డిమాండ్..

బ్యాంకింగ్ పరిశ్రమలో తక్షణమే 5 రోజుల పని వారాన్ని (5-Day Work Week) అమలు చేయాలన్నది ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ప్రస్తుతం ఉన్న పని ఒత్తిడిని తగ్గించడానికి, ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత (Work-Life Balance) కోసం ఈ మార్పు అత్యవసరమని వారు పేర్కొన్నారు. ఉద్యోగులు తమ నిరసనలో “Bankers are Humans – Not Machines” అనే నినాదంతో ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు.

వారానికి రెండు రోజుల విశ్రాంతి అనేది విలాసం కాదని, అది ఒక గౌరవప్రదమైన హక్కు అని బ్యాంకర్లు స్పష్టం పేర్కొన్నారు. విశ్రాంతి పొందిన బ్యాంకర్ కస్టమర్లకు మరింత బాధ్యతాయుతంగా సేవలు అందించగలరని వారు నినదించారు. ఈ సమ్మెలో UFBU అనుబంధ సంఘాలైన AIBEA, AIBOC, NCBE, AIBOA, BEFI, INBEF, INBOC, NOBW, NOBO ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని వివిధ బ్యాంక్ శాఖలకు చెందిన సిబ్బంది ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు.

ప్రజలకు ఇక్కట్లు..
బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం వల్ల జిల్లావ్యాప్తంగా నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్, ఇతర బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. సామాన్య ప్రజలు, వ్యాపారులు ఈ సమ్మె కారణంగా కొంత ఇబ్బందులకు గురయ్యారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని బ్యాంక్ యూనియన్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం, యాజమాన్యాలు స్పందించి 5 రోజుల పని దినాల విధానాన్ని వెంటనే ప్రకటించాలని వారు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *