ఎంఎస్ ధోనీ, తిలక్ వర్మతో పాటు భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ఈక్రికెట్ మొబైల్ గేమ్‌కు మద్దతు
లైట్‌ఫ్యూరీ గేమ్స్ త్వరలో తీసుకురానున్న ఈక్రికెట్ గేమ్‌లో ఎంఎస్ ధోనీ, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా మరియు సాయి సుదర్శన్ పెట్టుబడులు పెట్టారు. ఈ గేమ్‌లో వీరందరూ ప్లేయబుల్ అవతార్‌లుగా కూడా కనిపిస్తారు.

హైదరాబాద్, ఏప్రిల్ 24, 2026: ఏఏఏ (AAA) ఫోకస్డ్ గేమ్-టెక్ స్టూడియో అయిన లైట్‌ఫ్యూరీ గేమ్స్ (LFG), ఇవాళ ఒక కీలక ప్రకటన చేసింది. క్రికెట్ ప్రపంచంలోని దిగ్గజాలైన ఎంఎస్ ధోనీ, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, మరియు సాయి సుదర్శన్ వంటి పలువురు భారత అగ్రశ్రేణి క్రికెటర్లు ఈ స్టూడియోలో పెట్టుబడులు పెట్టారు. లైట్‌ఫ్యూరీ గేమ్స్ ఈ ఏడాది విడుదల చేయనున్న మొట్టమొదటి ఒరిజినల్ క్రికెట్ గేమ్ ‘ఈక్రికెట్’ (‘eCricket’)లో వీరంతా ప్లేయబుల్ అవతార్‌లుగా కూడా కనిపిస్తారు. ఇప్పటివరకు లైట్‌ఫ్యూరీ గేమ్స్ వివిధ రౌండ్ల ద్వారా దాదాపు 20 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధులను సేకరించింది. లైట్‌ఫ్యూరీ గేమ్స్ సేకరించిన 11 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రీ-సిరీస్ ఏ ఫండ్‌లో భాగంగా బ్లూమ్ వెంచర్స్, వీ3 వెంచర్స్, మిక్సీ (MIXI), టైమ్స్ ఇంటర్నెట్‌లతో కలిసి ఈ క్రికెట్ స్టార్లు వ్యూహాత్మక పెట్టుబడిదారులుగా చేరారు. 100 మంది సభ్యులున్న ఈ స్టూడియో, శ్రేష్ఠమైన, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల గేమ్‌లను రూపొందించడానికి అపారమైన సృజనాత్మక ప్రతిభను మరియు అధునాతన సాంకేతిక సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ భాగస్వామ్యం గురించి ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ ఇలా అన్నారు.. “నేను ఇన్నాళ్లలో ఎన్నో క్రికెట్ గేమ్స్ చూశాను, కానీ వాటిలో ఎప్పుడూ ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉండేది. లైట్‌ఫ్యూరీ గేమ్స్ వారు చేస్తున్న పనిని నాకు చూపించినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి వారు ప్రయత్నిస్తున్నారని నాకు అనిపించింది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం భారత్ నుండి ఇలాంటి ఒక గేమ్‌ను నిర్మించడం అనేది ఒక పెద్ద పని. క్రికెట్ రంగంలో నాకున్న అనుభవంతో నాకు తోచిన సలహాలు అందిస్తూ, చిన్న చిన్న వివరాలు కూడా పక్కాగా ఉండేలా చూడటమే నా బాధ్యత. మిగిలినదంతా వారి చేతుల్లోనే ఉంది, ఇప్పటివరకు నేను చూసిన దాని ప్రకారం వారు ఈ పనిని చాలా బాగా చేస్తారని నమ్ముతున్నాను.” అని పేర్కొన్నారు.
ఈ క్రికెట్ అనేది మొబైల్ ఆధారిత నైపుణ్యంతో కూడిన స్పోర్ట్స్ గేమ్. ఇది ఉచితంగా ఆడుకునే వెసులుబాటును కలిగి ఉంటుంది. ఇందులో ఎటువంటి బెట్టింగ్ లేదా డబ్బుతో కూడిన జూదం ఉండదు. ఈ గేమ్‌లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ అత్యంత సహజంగా ఉంటాయి. క్రీడాకారులు తీసుకునే నిర్ణయాల ఆధారంగా మ్యాచ్ పరిస్థితులు మారిపోతుంటాయి. వినియోగదారులు తమకు ఇష్టమైన క్రికెటర్ల రూపంలో ఇతరులతో కలిసి ఈ గేమ్‌ను ఆడుకోవచ్చు. అంతర్జాతీయ నిర్మాణ ప్రమాణాలతో భారత్ నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల కోసం ఒక ప్రీమియం లైవ్-సర్వీస్ క్రికెట్ గేమ్‌గా ఇది రూపొందుతోంది. భారత్ నుండి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఒక పక్కా క్రికెట్ గేమింగ్ ఫ్రాంచైజీని నిర్మించాలనే లైట్‌ఫ్యూరీ గేమ్స్ దీర్ఘకాలిక లక్ష్యానికి ఈ గేమ్ నిదర్శనంగా నిలుస్తుంది.
లైట్‌ఫ్యూరీ గేమ్స్ కో-ఫౌండర్ మరియు సీఈఓ కరణ్ ష్రాఫ్(Karan Shroff) మాట్లాడుతూ.. “భారత అగ్రశ్రేణి క్రికెటర్ల మద్దతు లభించడం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. భారత్‌లో తయారై ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడి ఆడే ఒక క్రికెట్ గేమ్‌ను నిర్మించాలనే మా లక్ష్యానికి ఇది ఒక నమ్మకానికి సంకేతం. ఈక్రికెట్ గేమ్ క్రికెట్ అభిమానుల కోసం అంతర్జాతీయ నాణ్యతను మరియు విశ్వసనీయతను తీసుకువస్తుంది. ఈ ఏడాది ఈ గేమ్‌ను లాంచ్ చేయడం కోసం మేం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం” అని అన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో లైట్‌ఫ్యూరీ గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 600 మందికి పైగా ప్రొఫెషనల్ క్రికెటర్లతో లైసెన్సింగ్ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటివరకు ప్రకటించిన క్రికెట్ గేమ్ రోస్టర్‌లలో ఇది అతిపెద్దది. ఈ గేమ్‌లో క్రిస్ గేల్, జో రూట్, బెన్ స్టోక్స్, కేన్ విలియమ్సన్, పాట్ కమిన్స్, జోస్ బట్లర్, ట్రావిస్ హెడ్ మరియు ఆండ్రీ రస్సెల్ వంటి పలువురు అంతర్జాతీయ అగ్రశ్రేణి క్రీడాకారులు కనిపిస్తారు.



