టెక్నాలజీ

250 బిలియన్ డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఐపీ రక్షణకు కీలక మార్గంగా ఎదుగుతున్న బ్లాక్‌చైన్

  • ప్రపంచవ్యాప్తంగా వీడియో, సంగీతం, పబ్లిషింగ్, గేమింగ్, విద్య, ఫోటోగ్రఫీ, స్వతంత్ర మీడియా రంగాల్లో 20 మిలియన్ల మంది క్రియేటర్లు ఉన్నారు.
  • యూట్యూబ్‌లో ప్రతి నిమిషానికి 500 గంటల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి.
  • ప్రపంచవ్యాప్తంగా ఏటా పేటెంట్ దరఖాస్తులు 35 లక్షలు దాటుతుండగా, ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు ఏటా 15 మిలియన్లు దాటుతున్నాయి.
  • ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2026 నాటికి 3,000 – 3,500 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా.

హైదరాబాద్: ఏటా ఏప్రిల్ 26న జరుపుకునే ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం (World IP Day 2026) ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రగతిలో సృజనాత్మకత, ఆవిష్కరణలు, మేధో సంపత్తి (IP) పోషించే పాత్రను చాటిచెబుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మీడియా, గేమింగ్, డిజైన్ మరియు పబ్లిషింగ్ రంగాల్లో డిజిటల్ సృష్టి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, బ్లాక్‌చైన్ సాంకేతికత కేవలం ఆర్థిక మౌలిక సదుపాయంగానే కాకుండా ఒక కంటెంట్ యొక్క ఒరిజినాలిటీని గుర్తించడానికి, దాని సృష్టికర్తను ధృవీకరించడానికి మరియు దీర్ఘకాలిక యాజమాన్య హక్కులను కాపాడటానికి ఒక కీలక మార్గంగా ఎదుగుతోంది.

నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో కంటెంట్ సృష్టి మునుపెన్నడూ లేనంత వేగంగా విస్తరిస్తోంది. యూట్యూబ్‌లో ప్రతి నిమిషానికి 500 గంటల కంటే ఎక్కువ నిడివి గల వీడియోలు అప్‌లోడ్ అవుతుండగా, జనరేటివ్ ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ కోట్లాది చిత్రాలను సృష్టిస్తున్నాయని అంచనా. కంటెంట్ తయారీ ఇంత భారీ స్థాయిలో జరుగుతుండటంతో.. సదరు కంటెంట్ ఒరిజినాలిటీని నిరూపించడం, దాని అసలు రచయిత లేదా క్రియేటర్ ఎవరో నిర్ధారించడం, యాజమాన్య వివాదాలను పరిష్కరించడం సవాలుగా మారింది. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను కాపీ చేయడం, ఇతరులకు పంపడం చాలా సులభం కావడంతో ఈ సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి.

ప్రపంచ మేధో సంపత్తి సంస్థ (WIPO) తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఏటా పేటెంట్ దరఖాస్తులు 3.5 మిలియన్లు దాటుతుండగా, ట్రేడ్‌మార్క్ దరఖాస్తులు ఏటా 15 మిలియన్లకుపైగా నమోదవుతున్నాయి. కాపీరైట్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్ గుర్తింపు మరియు ప్రోప్రైటరీ డేటా వంటి కనిపించని ఆస్తులు (Intangible assets) ఇప్పుడు ఎస్‌అండ్‌పీ 500(S&P 500) కంపెనీల మార్కెట్ విలువలో దాదాపు 90 శాతంగా ఉన్నాయి. 1975లో ఇది కేవలం 17 శాతంగా ఉండేది. ఆలోచనల యాజమాన్యం అనేది వ్యాపార విలువను ఏ విధంగా పెంచుతుందో ఇది నిరూపిస్తోంది. అదే సమయంలో, ప్రపంచ క్రియేటర్ ఎకానమీ విలువ ప్రస్తుతం సుమారు 250 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2027 నాటికి 480 బిలియన్ డాలర్లు దాటుతుందని అంచనా. వీడియో, సంగీతం, పబ్లిషింగ్, గేమింగ్, విద్య, ఫోటోగ్రఫీ మరియు స్వతంత్ర మీడియా రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా క్రియేటర్లు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.

డిజిటల్ రంగంలో యాజమాన్య వివాదాలను పరిష్కరించడం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంది. డిజిటల్ ఫైళ్లను ఎన్నిసార్లైనా కాపీ చేయవచ్చు, మెటాడేటాను మార్చవచ్చు. ప్లాట్‌ఫారమ్‌లను బట్టి టైమ్‌స్టాంప్‌లు మారుతుంటాయి. దీనివల్ల అసలు మొదటి యజమాని ఎవరు? ఆ కంటెంట్ ఎంతవరకు వాస్తవమైనది అనే విషయంలో గందరగోళం ఏర్పడుతోంది. సంప్రదాయ యాజమాన్య మరియు ధృవీకరణ వ్యవస్థలు ఈ వేగవంతమైన వృద్ధికి అనుగుణంగా పనిచేయలేకపోతున్నాయి. బ్లాక్‌చైన్ సాంకేతికత శాశ్వతమైన, మార్చడానికి వీలులేని యాజమాన్య రికార్డులను అందించడం ద్వారా ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. ఒక డిజిటల్ ఆస్తి వన్స్ ఆన్-చైన్‌లో నమోదైన తర్వాత, దాని తయారీ సమయం, క్రియేటర్ వివరాలు, బదిలీ చరిత్రను మార్చడం అసాధ్యం. పబ్లిక్ బ్లాక్‌చైన్ నెట్‌వర్క్‌లు ఇప్పటికే ప్రతిరోజూ మిలియన్ల కొద్దీ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి. కేవలం ఎథేరియం మాత్రమే ఇప్పటివరకు మొత్తంగా 200 కోట్లకు పైగా లావాదేవీలను పూర్తి చేయడం చూస్తుంటే.. గ్లోబల్ లెవల్‌లో మార్చడానికి వీలులేని రికార్డులను నిర్వహించడంలో దీని సామర్థ్యం ఏంటో అర్థమవుతుంది.

“డిజిటల్ సృష్టి అనేది డిజిటల్ యాజమాన్య రక్షణ కంటే వేగంగా విస్తరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెకన్లలో కంటెంట్‌ను కాపీ చేయగలిగే ప్రస్తుత వాతావరణంలో, వివాదాలు తలెత్తకముందే క్రియేటర్లకు తమ ఒరిజినాలిటీని నిరూపించుకునే సాక్ష్యం అవసరం. బ్లాక్‌చైన్ అనేది ఒక శాశ్వతమైన యాజమాన్య వ్యవస్థను అందుబాటులోకి తెస్తుంది, ఇది సదరు ఆస్తికి అనుసంధానమై ఉంటుంది. డిజిటల్ వ్యవస్థల్లో నమ్మకాన్ని బలపరుస్తుంది” అని జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్(Vikram Subburaj, CEO of Giottus) పేర్కొన్నారు.

కంటెంట్ పుట్టుక, దాని చరిత్ర (Provenance) ప్రాముఖ్యత కూడా డిజిటల్ మార్కెట్లను కొత్తగా తీర్చిదిద్దుతోంది. మ్యూజిక్ ట్రాక్‌లు, పరిశోధనా పత్రాలు, ఇల్యుస్ట్రేషన్లు మరియు డిజిటల్ డిజైన్‌లు ఇప్పుడు వాలెట్ ఐడెంటిటీలు, ఆన్-చైన్ టైమ్‌స్టాంప్‌లతో అనుసంధానమైన, ధృవీకరించదగిన యాజమాన్య రికార్డులను కలిగి ఉండవచ్చు. ఎన్ఎఫ్‌టీ (NFT) స్వీకరణ సమయంలో బ్లాక్‌చైన్ ఆధారిత ప్రొవెనెన్స్‌కు విస్తృత గుర్తింపు లభించింది. ఆ సమయంలో ధ్రువీకరించిన యాజమాన్య మార్కెట్లు గరిష్టంగా ఏడాదికి 24 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ వాల్యూమ్‌ను నమోదు చేశాయి.

లైసెన్సింగ్, రాయల్టీల ప్రక్రియను ఆటోమేట్ చేయడం ద్వారా స్మార్ట్ కాంట్రాక్టులు ఆదాయాన్ని పొందేందుకు అదనపు మార్గాన్ని కల్పిస్తాయి. సంగీతం, పబ్లిషింగ్ వంటి రంగాల్లో సంప్రదాయ రాయల్టీ సెటిల్మెంట్లకు 6-18 నెలల సమయం పడుతుంది. కానీ బ్లాక్‌చైన్ ఆధారిత విధానం ద్వారా ఈ చెల్లింపులు సెకన్లు లేదా నిమిషాల్లోనే పూర్తవుతాయి. ఇది పారదర్శకతను పెంచడంతో పాటు క్రియేటర్లకు నగదు లభ్యతను మెరుగుపరుస్తుంది. విక్రమ్ సుబ్బురాజ్ దీని గురించి మాట్లాడుతూ.. “కంటెంట్ సృష్టించడమే కాకుండా, దాని యాజమాన్య హక్కులను ధృవీకరించుకోవడం కూడా ఇప్పుడు అంతే కీలకంగా మారుతోంది. డిజిటల్ ఆస్తులు వివిధ ప్లాట్‌ఫారమ్‌లు, దేశాల సరిహద్దులు దాటి విస్తరిస్తున్నప్పుడు.. అసలు రచయిత ఎవరు, లైసెన్సింగ్, ఆదాయం వంటి అంశాలపై బ్లాక్‌చైన్ స్పష్టతనిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా క్రియేటర్ ఎకానమీలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ సామర్థ్యాలు చాలా అవసరం” అని పేర్కొన్నారు.

బ్లాక్‌చైన్ ఆధారిత ఐపీ ధ్రువీకరణకు సంబంధించి భారత్ అత్యంత అనుకూలమైన మార్కెట్‌గా ఉంది. మన దేశంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు, సంగీతకారులు, అధ్యాపకులు, ప్రాంతీయ భాషా పబ్లిషర్లు, స్వతంత్ర మీడియా నిపుణులు కలిపి దాదాపు 80 మిలియన్లకుపైగా క్రియేటర్లు ఉన్నారు. అంతేకాకుండా, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ పరిశ్రమ 2026 నాటికి 3,000 – 3,500 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పారదర్శకమైన యాజమాన్య పర్యవేక్షణ మరియు లైసెన్సింగ్‌పై స్పష్టత కోసం డిమాండ్ నిరంతరం పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *