బేకర్ హ్యూస్ కోసం ఆజాద్ ఇంజినీరింగ్ ప్రత్యేక లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభం
విడిభాగాల తయారీ రంగంలో ముందున్న ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ మరో ముఖ్యమైన అడుగు వేసింది.

హైదరాబాద్: విడిభాగాల తయారీ రంగంలో ముందున్న ఆజాద్ ఇంజినీరింగ్ సంస్థ మరో ముఖ్యమైన అడుగు వేసింది. హైదరాబాద్‌లోని తునికిబొల్లారంలో ఉన్న తన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో 7,600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త తరం తయారీ కేంద్రాన్ని (లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ) ప్రారంభించింది. ప్రపంచ ప్రసిద్ధ ఇంధన సాంకేతిక సంస్థ బేకర్ హ్యూస్‌కు అవసరమైన ఉత్పత్తులను అందించడానికి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కేంద్రాన్ని నిర్మించారు.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశ్రామిక రంగానికి చెందిన పలువురు ప్రముఖులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఇందులో టీజీఐఐసీ వీసీ, ఎండీ కె. శశాంక, పరిశ్రమల వాణిజ్య శాఖ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ డైరెక్టర్ వి.మధుసూదన్, ఏరోస్పేస్, డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ పీఏ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బేకర్ హ్యూస్ సంస్థకు చెందిన సీనియర్ నాయకత్వ బృందంతో పాటు ఆజాద్ ఇంజనీరింగ్ ఛైర్మన్ మరియు సీఈఓ శ్రీ రాకేష్ చోప్దార్ పాల్గొన్నారు. బేకర్ హ్యూస్ ప్రతినిధులుగా ఐఈటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ డేవిడ్ మరానీ(Davide Marrani), సోర్సింగ్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ స్టీఫెన్ హిన్సన్, ఐఈటీ ప్రొక్యూర్మెంట్ అండ్ లాజిస్టిక్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ మార్సెల్లో బరియాని, ఇండియా సీనియర్ సోర్సింగ్ డైరెక్టర్ మిస్టర్ విశాల్ మురుగుడ్కర్ మరియు మిస్టర్ పీవీఎస్ రాజు ఈ ప్రారంభోత్సవంలో పాలుపంచుకున్నారు.
2018వ సంవత్సరంలో గ్యాస్ మరియు స్టీమ్ టర్బైన్ ఫినిష్ స్టేజీల కోసం కీలకమైన రోటేటింగ్ ఎయిర్‌ఫాయిల్స్‌ను సరఫరా చేసే అత్యంత కఠినమైన ఒప్పందంతో ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు లోతైన మరియు వ్యూహాత్మక తయారీ భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ఈ మైలురాయిని చేరుకోవడంలో ఎదురైన సవాళ్లు, పట్టుదల మరియు నిరంతర సామర్థ్య పెంపుదల ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఆజాద్ ఇంజrనీరింగ్ ప్రపంచంలోనే అత్యంత కఠినమైన క్వాలిఫికేషన్ విధానాలను విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో భాగంగా వివిధ రకాల ముడి పదార్థాల నాణ్యతను నిరూపించుకోవడంతో పాటు, సంక్లిష్టమైన తయారీ ప్రక్రియల ధృవీకరణ మరియు కీలక విడిభాగాల స్థాయిలో ప్రోడక్ట్ అప్రూవల్స్ సాధించింది. దీనితో పాటు ప్రత్యేకమైన తయారీ ప్రక్రియల కోసం ఒక పటిష్టమైన సబ్-టైర్ ఎకోసిస్టమ్‌ను కూడా ఆజాద్ ఇంజనీరింగ్ అభివృద్ధి చేసి ధృవీకరించింది. దీనివల్ల వాల్యూ చైన్ అంతటా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకత చేకూరింది. బేకర్ హ్యూస్ సంస్థ నిర్దేశించిన కఠినమైన సాంకేతిక ప్రమాణాలు, కచ్చితత్వాన్ని చేరుకోవడానికి ప్రతి దశలోనూ ఆజాద్ ఇంజనీరింగ్ ఎంతో శ్రమించి విజయం సాధించింది. తద్వారా స్థిరమైన నాణ్యతను అందిస్తూ తన సాంకేతిక ప్రతిభను నిరూపించుకుంది.
వర్టికల్ ఇంటిగ్రేషన్, అధునాతన క్వాలిటీ సిస్టమ్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు క్రమశిక్షణతో కూడిన పనితీరు ద్వారా ఆజాద్ ఇంజనీరింగ్ విశేష గుర్తింపు పొందింది. మైక్రాన్ స్థాయి కచ్చితత్వంతో విడిభాగాలను నిరంతరం మరియు భారీ స్థాయిలో ఉత్పత్తి చేయగల నైపుణ్యం కలిగిన సిబ్బందిని ఈ సంస్థ తయారు చేసింది. అత్యంత కఠినమైన గడువుల లోపు మరియు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను సరఫరా చేయడంలో ఆజాద్ మంచి పేరు సంపాదించింది. ప్రస్తుతం బేకర్ హ్యూస్ సంస్థకు చెందిన ఆయిల్ ఫీల్డ్ సర్వీసెస్ అండ్ ఎక్విప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో కూడా ఆజాద్ కీలక భాగస్వామిగా ఉంది. ఇది బేకర్ హ్యూస్ గ్లోబల్ సప్లై చైన్ వ్యూహంలో ఒక అంతర్భాగంగా మారింది.
ఈ కేంద్రం ప్రధాన విశేషాలు
- భారీ స్థాయి ఉత్పత్తి వేగం, కచ్చితత్వం కోసం దీనిని నిర్మించారు
- 7600 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అత్యాధునిక లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి
- బేకర్ హ్యూస్ ఐఈటీ ప్రోగ్రామ్‌లకు అవసరమైన విడిభాగాలను భారీ స్థాయిలో తయారు చేసేలా దీనిని రూపొందించారు
- సుమారు 230 మంది నైపుణ్యం కలిగిన నిపుణులు ఇక్కడ పనిచేస్తున్నారు
- ఉత్పాదకతను పెంచేందుకు అత్యాధునిక పరికరాలు మరియు ప్రత్యేక ప్రాసెస్ ఫ్లోను సిద్ధం చేశారు
- ఇది ఆజాద్ సంస్థకు చెందిన సీఓఈ మరియు ఇన్నోవేషన్ సెంటర్ ఎకోసిస్టమ్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానమై ఉంటుంది
- అంతర్జాతీయ తయారీ రంగంలో భారతదేశం సాధిస్తున్న బలానికి ఈ కేంద్రం తోడ్పడుతుంది
ఈ సందర్భంగా ఆజాద్ ఇంజినీరింగ్ ఛైర్మన్, సీఈఓ రాకేష్ చోప్దార్ మాట్లాడుతూ.. “ఈ ప్రత్యేక లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభం కావడం బేకర్ హ్యూస్‌తో మా ఎనిమిదేళ్ల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. 2018లో మేము చేపట్టిన అత్యంత కఠినమైన క్వాలిఫికేషన్ మార్గాలలో ఒకటిగా ఈ భాగస్వామ్యం ప్రారంభమైంది. గ్యాస్ మరియు స్టీమ్ టర్బైన్ ఫినిష్ స్టేజీల కోసం కీలకమైన రోటేటింగ్ ఎయిర్‌ఫాయిల్స్‌ను సరఫరా చేయడం ద్వారా బేకర్ హ్యూస్‌తో మొదలైన మా ప్రయాణం, నేడు ఇండస్ట్రియల్ అండ్ ఎనర్జీ టెక్నాలజీ వ్యాపారంలో లోతైన, వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఎదిగింది. హైదరాబాద్‌లోని తునికిబొల్లారంలో గల మా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్మించిన ఈ 7,600 చదరపు మీటర్ల కేంద్రం, బేకర్ హ్యూస్ కోసం ప్రత్యేకంగా ఇన్-హౌస్ స్పెషల్ ప్రాసెస్ సామర్థ్యాలతో కూడిన ప్రపంచ స్థాయి తయారీ కేంద్రాన్ని నిర్మించాలనే మా వ్యూహంలో భాగం. సుమారు 230 మంది నైపుణ్యం కలిగిన నిపుణులతో కలిసి, సంక్లిష్టమైన విడిభాగాలను భారీ స్థాయిలో మరియు మైక్రాన్ల కచ్చితత్వంతో అందించగల ఒక ఉన్నత స్థాయి వ్యవస్థను మేము సృష్టిస్తున్నాము. ఈ కేంద్రం భారతదేశ తయారీ రంగ భవిష్యత్తుపై మాకున్న నమ్మకానికి మరియు ఆ రంగంలో ముందుండాలనే ఆజాద్ నిబద్ధతకు నిదర్శనం.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బేకర్ హ్యూస్ ఐఈటీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ మరానీ మాట్లాడుతూ: “ఆజాద్ ఇంజనీరింగ్ కొత్త తయారీ కేంద్రం ప్రారంభం కావడం బేకర్ హ్యూస్ గ్లోబల్ సప్లై చైన్‌ను బలోపేతం చేయడమే కాకుండా మా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ విస్తరణ ద్వారా ఆజాద్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా మా వ్యాపార అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఉత్పత్తులను భారీ స్థాయిలో అందించగలుగుతుంది. పోటీతత్వంతో కూడిన మరియు పటిష్టమైన గ్లోబల్ సప్లై చైన్‌ను నిర్మించడంలో ఇలాంటి భాగస్వామ్యాలు చాలా అవసరం. మా ప్రయాణంలో ఈ తదుపరి ఘట్టాన్ని కలిసి జరుపుకోవడం మాకు గర్వకారణంగా ఉంది” అని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు మాట్లాడుతూ: “తునికిబొల్లారంలో బేకర్ హ్యూస్ కోసం ఆజాద్ ఇంజనీరింగ్ తన అత్యాధునిక తయారీ కేంద్రాన్ని ప్రారంభించడం తెలంగాణకు గర్వకారణం. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ తెలంగాణ’ లక్ష్యాలకు నిదర్శనం. 120కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఇంధన సాంకేతిక అగ్రగామి బేకర్ హ్యూస్ సంస్థ, తన మేక్ ఇన్ ఇండియా కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఈ అద్భుతమైన మైలురాయిని అధిగమించినందుకు రాకేష్ చోప్దార్, ఆజాద్ ఇంజినీరింగ్ కుటుంబానికి నా అభినందనలు. తెలంగాణలోని ప్రిసిషన్ ఇంజనీరింగ్ రంగం దశాబ్ద కాలంగా ఏటా 30 శాతం వృద్ధిని సాధిస్తోంది. కేవలం గత ఏడాదిలోనే ఎగుమతులు 103 శాతం పెరిగాయి. 1500కు పైగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) ఉండటంతో పాటు లాక్‌హీడ్ మార్టిన్, బోయింగ్, జీఈ ఏవియేషన్, సాఫ్రాన్, ఎయిర్‌బస్ మరియు హనీవెల్ వంటి గ్లోబల్ సంస్థలు ఇక్కడ పదేపదే పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలోనే అత్యంత పురోగామి పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహకాలతో, కేవలం తయారీకే పరిమితం కాకుండా తెలంగాణను ఇంజినీరింగ్ ఇన్నోవేషన్‌కు ప్రపంచ కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం. బేకర్ హ్యూస్ మరియు ఆజాద్ ఇంజనీరింగ్ మధ్య కుదిరిన ఈ భాగస్వామ్యం మా పారిశ్రామిక వ్యవస్థ అందించగల ప్రపంచ స్థాయి సహకారానికి ఒక నమూనాగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆజాద్ ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ విష్ణు మల్పాని మాట్లాడుతూ: “ముడి పదార్థాల నాణ్యతను నిరూపించుకోవడం, సంక్లిష్టమైన తయారీ పద్ధతులను ధృవీకరించడం మరియు ప్రత్యేక ప్రక్రియల కోసం సర్టిఫైడ్ సబ్-టైర్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం వరకు మా తయారీ వ్యవస్థలోని ప్రతి విభాగంలోనూ ఏళ్ల తరబడి మేం చేసిన క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల ఫలితమే ఈ కేంద్రం. బేకర్ హ్యూస్ తన సప్లై చైన్ కోసం నిర్దేశించిన ప్రమాణాలు ప్రపంచంలోనే అత్యంత కఠినమైనవి. అందుకే మేం ప్రతి దశలోనూ ఎక్కడా రాజీ పడకుండా పనిచేశాం. ఇక్కడ మేం నిర్మించిన ఈ అత్యాధునిక తయారీ కేంద్రం ప్రపంచ స్థాయి ఓఈఎం (OEM) ఉత్పత్తికి అవసరమైన కచ్చితత్వాన్ని మరియు భారీ స్థాయి ఉత్పాదకతను అందించేలా ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, ఆ డిమాండ్‌ను అందుకోవడమే కాకుండా దానిని పూర్తి చేయడంలో ఆజాద్‌ను అగ్రస్థానంలో నిలబెట్టేలా ఈ కేంద్రం తోడ్పడుతుంది.” అని అన్నారు.
ఇది ఆజాద్ ఇంజనీరింగ్ ప్రారంభించిన నాలుగో ప్రత్యేక తయారీ కేంద్రం. ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ మరియు ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడానికి కంపెనీ తన సామర్థ్యాన్ని వేగంగా విస్తరిస్తోందని తాజా కార్యక్రమం నిరూపిస్తోంది.
ఈ ప్రారంభోత్సవం కేవలం ఒక విస్తరణ మాత్రమే కాదు. ఇది సంస్థ బలమైన సంకల్పానికి నిదర్శనం. ఆజాద్ ఇంజనీరింగ్ కేవలం అంతర్జాతీయ ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా, ఆ రంగానికి ఒక దిశానిర్దేశం చేస్తోంది.



