తెలంగాణ

బిర్యానీకి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్: ‘వన్‌చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్’ గ్రాండ్ ఫినాలేలో సందడి!

దేశవ్యాప్తంగా ఉన్న బిర్యానీ రుచులను ఒకే వేదికపైకి తెస్తూ, ఫిలిప్స్ గృహోపకరణాల సంస్థ ‘వర్సుని ఇండియా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వన్‌చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్’ హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్‌లో ఘనంగా ముగింపు దశకు చేరుకుంది

దేశవ్యాప్తంగా ఉన్న బిర్యానీ రుచులను ఒకే వేదికపైకి తెస్తూ, ఫిలిప్స్ గృహోపకరణాల సంస్థ ‘వర్సుని ఇండియా’ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వన్‌చెఫ్ బిర్యానీ ప్రీమియర్ లీగ్’ హైదరాబాద్‌లోని విజయ్ సేల్స్‌లో ఘనంగా ముగింపు దశకు చేరుకుంది. ఆహార ప్రియుల అభిరుచులను, ప్రాంతీయ బిర్యానీ వైవిధ్యాలను వేడుకగా జరుపుకున్న ఈ గ్రాండ్ ఫినాలేకు కంటెంట్ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు , వంట నిపుణులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

ఈ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీ చెఫ్ రణవీర్ బ్రార్ , నటి తేజస్వి మదివాడ, దేశవ్యాప్త ఓటింగ్ ద్వారా ఎంపికైన ఫలితాలను వెల్లడించారు. ఈ పోరులో హైదరాబాద్ బిర్యానీ అత్యధిక ఆదరణను దక్కించుకుని ‘ఇండియాస్ ఫేవరెట్ బిర్యానీ’ కిరీటాన్ని కైవసం చేసుకున్నట్లు వారు ప్రకటించారు.

హైదరాబాద్, అవధి, కోల్‌కతా వంటి వివిధ రకాల బిర్యానీలపై వినియోగదారులు చూపిన ఉత్సాహం, వారి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన పోటీకి నిదర్శనంగా నిలిచింది. కష్టతరమైన వంటకాలను సైతం వన్‌చెఫ్ పరికరంతో ఇంట్లోనే అద్భుతంగా వండుకోవచ్చని చెఫ్ రణవీర్ బ్రార్ ప్రత్యక్ష ప్రదర్శన (లైవ్ డెమో) ద్వారా చూపించారు. వర్సుని ఇండియా మార్కెటింగ్ చీఫ్ పూజా బైడ్ మాట్లాడుతూ, భారతీయుల ఆహార అలవాట్లలోని భావోద్వేగాలను అర్థం చేసుకుని, వారి వంటింటి పనులను మరింత సులభతరం చేసేందుకు నిరంతరం వినూత్న ఆవిష్కరణలను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *