తెలంగాణ

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాల్లో అలెన్ హైదరాబాద్ ప్రభంజనం… జాతీయ స్థాయిలో రుషి, రఘు కపిష్ టాప్ ర్యాంకులు!

ఐఐటీ రూర్కీ తాజాగా విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలలో అలెన్ హైదరాబాద్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో విజయకేతనం ఎగురవేశారు

ఐఐటీ రూర్కీ తాజాగా విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలలో అలెన్ హైదరాబాద్ విద్యార్థులు అద్భుతమైన మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షలో ఇక్కడి క్యాంపస్ విద్యార్థి రుషి ప్రేమ్‌నాథ్ ఆల్ ఇండియా స్థాయిలో 177వ ర్యాంకును సొంతం చేసుకోగా, సామవేదం రఘు కపిష్ అక్షిత్ 192వ ర్యాంకుతో దేశంలోనే టాప్ 200 ఉత్తమ ర్యాంకర్ల జాబితాలో నిలిచారు. వీరితో పాటు అలెన్ హైదరాబాద్ సెంటర్ నుండి మొత్తం ఏడుగురు విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ 1000 లోపల అద్భుతమైన ర్యాంకులను సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు.

ఈ అసాధారణ విజయాల నేపథ్యంలో అలెన్ హైదరాబాద్ కోచింగ్ సెంటర్ లో వేడుకలు అంబరాన్నంటాయి. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇన్‌స్టిట్యూట్ ఫ్యాకల్టీ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించి మిఠాయిలు తినిపించారు. దేశంలోనే అత్యున్నత ఐఐటీ శిక్షణ అందించడంలో అలెన్ హైదరాబాద్ కు ఉన్న అగ్రస్థానాన్ని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయని సంస్థ సెంటర్ హెడ్ సౌరభ్ తివారీ, సౌత్ జోన్ హెడ్ మహేష్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు.

గర్ల్స్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆరోహి దేశ్‌పాండే
హైదరాబాద్ సెంటర్ లో నిర్వహించిన ఈ విజయోత్సవ సభలో జేఈఈ అడ్వాన్స్‌డ్ గర్ల్స్ టాపర్ ఆరోహి దేశ్‌పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలెన్ ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల పాటు నిరంతరాయంగా క్లాస్‌రూమ్ కోచింగ్ తీసుకున్న ఆరోహి, ఈ కఠినమైన పరీక్షలో 280 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆమె మహిళల విభాగంలో దేశంలోనే ఆల్ ఇండియా 1వ ర్యాంకును కైవసం చేసుకోవడమే కాకుండా, కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL) లోనూ 77వ స్థానాన్ని దక్కించుకుని విద్యావేత్తల ప్రశంసలు అందుకుంది.

జాతీయ స్థాయిలో అలెన్ చారిత్రాత్మక రికార్డు – మొదటి మూడు ర్యాంకులు క్లీన్ స్వీప్
ఇక దేశవ్యాప్తంగా చూస్తే, కోటాకు చెందిన అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ వరుసగా మూడవ ఏడాది కూడా ఆల్ ఇండియా మొదటి ర్యాంకును తనవశం చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించింది. అంతేకాకుండా అలెన్ విద్యాసంస్థల ప్రస్థానంలో రెండోసారి దేశంలోనే టాప్ 3 ర్యాంకులను (AIR 1, AIR 2, AIR 3) ఒకేసారి క్లీన్ స్వీప్ చేసి ఎవరికీ సాధ్యంకాని సరికొత్త రికార్డును నమోదు చేసింది. అలెన్ క్లాస్‌రూమ్ విద్యార్థి శుభమ్ కుమార్ 330 మార్కులతో ఆల్ ఇండియా 1వ ర్యాంకును కైవసం చేసుకోగా, కబీర్ చిల్లర్ 2వ ర్యాంకును, జతిన్ చహర్ 3వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో అలెన్ విద్యార్థులు టాప్ 10 లోపల 6 ర్యాంకులు, టాప్ 50 లోపల 24 ర్యాంకులు సాధించి తమ తిరుగులేని ఆధిక్యాన్ని చాటగా, ఆన్‌లైన్ కోచింగ్ విభాగంలో యశ్‌వర్ధన్ 52వ ర్యాంకుతో టాపర్‌గా నిలిచాడని విద్యా సంస్థ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *