బిజినెస్
సెబీ (SEBI) వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసిన ప్రజ్ఞావన్ టెక్నాలజీస్
విభిన్న వ్యాపార పరిష్కారాలను అందిస్తున్న 'ప్రజ్ఞావన్ టెక్నాలజీస్ లిమిటెడ్', తన ఐపీఓ (IPO) ప్రక్రియలో భాగంగా సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సమర్పించింది

విభిన్న వ్యాపార పరిష్కారాలను అందిస్తున్న ‘ప్రజ్ఞావన్ టెక్నాలజీస్ లిమిటెడ్’, తన ఐపీఓ (IPO) ప్రక్రియలో భాగంగా సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (DRHP)ను సమర్పించింది. కంపెనీ రూ. 400 కోట్ల విలువైన కొత్త షేర్ల జారీతో పాటు, 15 మిలియన్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించాలని నిర్ణయించింది.
సమకూరిన నిధులలో రూ. 4,000 కోట్ల మేర మొత్తాన్ని పని మూలధన (Working Capital) అవసరాల కోసం వినియోగించనున్నారు. స్కిల్ డెవలప్మెంట్, శిక్షణ ఉత్పత్తులు మరియు యుటిలిటీ సొల్యూషన్స్ (విద్యుత్, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల నిర్వహణ) విభాగాలలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూకు పాంతోమాత్ క్యాపిటల్ అడ్వైజర్స్ సంస్థ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.



