స్వల్పకాలిక ఆర్థిక బాధ్యతల కోసం 10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్
గృహ రుణాలు, వ్యాపార రుణాలు , పిల్లల చదువుల వంటి నిర్దిష్ట ఆర్థిక బాధ్యతలు ఉన్న కస్టమర్ల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక అద్భుతమైన బీమా పరిష్కారాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది

గృహ రుణాలు, వ్యాపార రుణాలు , పిల్లల చదువుల వంటి నిర్దిష్ట ఆర్థిక బాధ్యతలు ఉన్న కస్టమర్ల కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక అద్భుతమైన బీమా పరిష్కారాన్ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. సంస్థ తాజాగా ‘ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్’ (ICICI Pru iProtect Smart Plus) పేరుతో ప్రత్యేకంగా 10 ఏళ్ల లైఫ్ కవర్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. కుటుంబంలో ఆర్థిక బాధ్యతలు , ఆదాయంపై ఆధారపడే పరిస్థితి అత్యధికంగా ఉండే అత్యంత కీలక సమయంలో ఈ పాలసీ, అవసరమైన జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ముంబై వేదికగా విడుదల చేసిన ఈ ప్లాన్, బాధ్యతలు ఎక్కువగా ఉండే ప్రారంభ సంవత్సరాల్లో కుటుంబానికి పూర్తి రక్షణ కవచంగా నిలుస్తుంది.
చాలా మంది వ్యక్తులకు ఒక పెద్ద ఆర్థిక బాధ్యతను నెత్తిన వేసుకున్న తర్వాత మొదటి పదేళ్ల కాలం అత్యంత కీలకమైనదిగా మారుతుంది. నిర్దిష్ట కాలపరిమితితో బిజినెస్ రుణాలు తీసుకున్న స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు, హోమ్ లోన్ తీసుకున్న వారికి , పిల్లల ఉన్నత చదువుల కోసం ముందస్తుగా ప్లాన్ చేస్తున్న తల్లిదండ్రులకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ కీలక దశలో కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించేలా, అందరికీ అందుబాటులో ఉండే ధరలోనే ఈ 10 ఏళ్ల లైఫ్ కవర్ సొల్యూషన్‌ను సంస్థ డిజైన్ చేసింది.
తగ్గని లైఫ్ కవర్.. పాలసీదారుని కుటుంబానికి పూర్తి భరోసా
ఈ సరికొత్త ప్లాన్ ముఖ్య లక్షణం ఏమిటంటే, 10 ఏళ్ల పాలసీ కాలపరిమితి పొడవునా లైఫ్ కవర్ మొత్తం ఏమాత్రం తగ్గకుండా స్థిరంగా కొనసాగుతుంది. దీనివల్ల ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు పాలసీదారుని కుటుంబానికి పూర్తి బీమా మొత్తం అందుతుంది. ఇది కేవలం అప్పటికి ఉన్న రుణ బాధ్యతలను తీర్చడానికే కాకుండా, కుటుంబ సభ్యుల ఇతర ఆర్థిక అవసరాలను , భవిష్యత్తు లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది. వ్యక్తులు , వారి కుటుంబాలు మరింత ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో సహాయపడే చక్కని బీమా పరిష్కారాలను అందిస్తూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తన ప్రొటెక్షన్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ ప్లాన్ దోహదపడుతుంది.
‘2047 నాటికి అందరికీ బీమా’ లక్ష్యానికి తోడ్పాటు
ఈ కొత్త ప్లాన్ లాంచ్ సందర్భంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ వికాస్ గుప్తా మాట్లాడుతూ, ఇల్లు కొనడం, వ్యాపారాన్ని తీర్చిదిద్దుకోవడం లేదా పిల్లల చదువుల కోసం డబ్బు సమకూర్చుకోవడం వంటి అనేక ఆర్థిక లక్ష్యాలు ఒక నిర్దిష్ట కాలపరిమితితో ముడిపడి ఉంటాయని వివరించారు. కస్టమర్లు తమ ఆర్థిక బాధ్యతలను సజావుగా నిర్వర్తిస్తూనే, కుటుంబ సభ్యుల ఆర్థిక భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు వీలుగా ఈ కీలకమైన సంవత్సరాల్లో రక్షణ కల్పించడానికి ‘ఐసీఐసీఐ ప్రు ఐప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్’ను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. జీవితంలో వివిధ దశల్లో కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా రక్షణ పరిష్కారాలను అందించాలనే తమ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. తద్వారా దేశంలో బీమా విస్తృతిని పెంచి, భారత ప్రభుత్వం , నియంత్రణ సంస్థ నిర్దేశించుకున్న ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే జాతీయ లక్ష్యానికి తమ వంతు పూర్తి సహకారం అందిస్తున్నామని వికాస్ గుప్తా స్పష్టం చేశారు.



