తెలంగాణసంగారెడ్డి

సిగాచి పరిశ్రమ ఘోర ప్రమాద బాధిత కుటుంబాలకు నష్టపరిహారచెక్కుల అందజేత

సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లోని కార్మిక శాఖ ఆఫీస్ లో డిప్యూటీ లేబర్ కమిషనర్ డిసీఎల్  రవీందర్ రెడ్డి  చేతుల మీదుగా సిగాచి బాధిత కుటుంబాలకు అందజేశారు

కందిలి, సంగారెడ్డి
సంగారెడ్డి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ లోని కార్మిక శాఖ ఆఫీస్ లో డిప్యూటీ లేబర్ కమిషనర్ డిసీఎల్  రవీందర్ రెడ్డి  చేతుల మీదుగా సిగాచి బాధిత కుటుంబాలకు అందజేశారు.. మార్చి 31 పోస్టెడ్  చెక్కులు ఇచ్చారు.. భాధితులతో పాటు టిజేఎసి జిల్లా చైర్మన్ అశోక్ కుమార్ సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్ టిజేఎసి రాష్ట్ర నాయకురాలు లక్ష్మి ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిగాచి పరిశ్రమల్లో 2025 జూన్ 30 జరిగిన ఘోర ప్రమాదంలో 54 కార్మికులు మృత్యువాత పడ్డారని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారు. కానీ నేటికీ పూర్తి నష్టపరిహారం అందలేదని తెలిపారు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత ఇస్తున్నారు. మిగిలిన పూర్తి నష్టపరిహారం వెంటనే చెల్లించాలి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *