తెలంగాణసంగారెడ్డి

సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు.. 52 నామినేషన్లు ఉపసంహరణ

సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది

  • అత్యధికంగా నారాయణఖేడ్, సదాశివపేట, సంగారెడ్డిలో ప్రభావం

కందిలి, సంగారెడ్డి
సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వార్డు సభ్యుల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలోని 11 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 256 వార్డులు ఉండగా, 1,479 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 52 నామినేషన్లు ఉపసంహరణ అయినట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి తెలిపారు. సోమవారం ఒక్కరోజే 47 నామినేషన్లు ఉపసంహరణ కాగా, గత రోజుల కలిపి ఈ సంఖ్య 52కు చేరింది.

పట్టణాల వారీగా ఉపసంహరణ వివరాలు: జిన్నారం – 8, నారాయణఖేడ్ – 12, సదాశివపేట – 11, సంగారెడ్డి – 10, అందోల్ జోగిపేట – 5, ఇస్నాపూర్ – 3, గడ్డపోతారం – 2, ఇంద్రేశం – 1, గుమ్మడిదల, కోహీర్, జహీరాబాద్ – ఉపసంహరణలు లేవు, రాజకీయ పార్టీల వారీగా: నామినేషన్ల ఉపసంహరణల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 25, బీఆర్ఎస్ నుంచి 15, బీజేపీ నుంచి 4, ఏఐఎంఐఎం నుంచి 1, ఇతర గుర్తింపు పొందిన పార్టీల నుంచి 1, స్వతంత్ర అభ్యర్థులు 6 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణల అనంతరం జిల్లాలోని పలుచోట్ల ఎన్నికల పోటీ ఆసక్తికరంగా మారింది. మరికొన్ని వార్డుల్లో ఏకగ్రీవ ఎన్నికల అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వివరాలను సంగారెడ్డి జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ధ్రువీకరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *