తెలంగాణసంగారెడ్డి

BRS: సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలు.. 38 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల బి ఫారమ్‌ల సమర్పణ

సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ బలపరిచిన 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల భీ–ఫారమ్‌లను సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారికంగా సమర్పించారు.

సంగారెడ్డి మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ బలపరిచిన 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల బి  ఫారమ్‌లను సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో అధికారికంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీఎన్‌జీవోస్ సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి పాల్గొని అభ్యర్థులకు భీ–ఫారమ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలిగి, పట్టణ అభివృద్ధినే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి పట్టణాభివృద్ధికి సహకరించాలని ప్రజలను వారు విజ్ఞప్తి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *