తెలంగాణసంగారెడ్డి

Neelam Madhu: ఐక్యంగా పనిచేసి ఐదు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి – నీలం మధు, కాట శ్రీనివాస్ గౌడ్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని నీలం మధు ముదిరాజ్ అన్నారు.

పటాన్‌చెరు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు, పటాన్‌చెరు ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం అశోక్ నగర్‌లోని కాట శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఐదు మున్సిపాలిటీల కౌన్సిలర్ అభ్యర్థులకు వారు అధికారికంగా బి-ఫారమ్‌లను అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సర్వేల ఆధారంగా ప్రజాదరణ ఉన్న వారికే టికెట్లు కేటాయించామని స్పష్టం చేశారు. టికెట్ దక్కని నాయకులు నిరాశ చెందవద్దని, పార్టీ కోసం కష్టపడే వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రతి ఇంటికీ వివరించి, అభ్యర్థుల మెజారిటీకి ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *