తెలంగాణసంగారెడ్డి

BRS: 5వ వార్డులో బీఆర్ఎస్‌లోకి చేరికలు.. ఆ పార్టీకి షాక్

మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ సంగారెడ్డిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న వేళ సంగారెడ్డిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పట్టణంలోని 5వ వార్డుకు చెందిన ఏఐఎంఐఎం నాయకులు పెద్ద సంఖ్యలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఎంఐఎం 5వ వార్డు అధ్యక్షుడు షేక్ షరీఫ్‌తో పాటు సయ్యద్ జాఫర్ హుస్సిన్, సయ్యద్ సలీముద్దీన్, ఇతర అనుచరులు కలిపి సుమారు 50 మంది బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బసిత్, కౌన్సిలర్ అభ్యర్థి యూనిస్ ఈ చేరికలను సమన్వయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం తాము చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు బీఆర్ఎస్‌లో చేరుతున్నారని తెలిపారు. వార్డులో పార్టీ అభ్యర్థి విజయానికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జి రాజనర్సు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *