రైతుబంధు వెంటనే వేయకపోతే కాంగ్రెస్‌ను రైతులు చీల్చి చెండాడతారు: హరీష్ రావు హెచ్చరిక
గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు

గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణను సాధించిన కేసీఆర్ జాతిపిత అయితే, రేవంత్ రెడ్డి బూతుల పిత అని ఆయన విమర్శించారు.
రైతుభరోసాకు డిమాండ్: ఇప్పటికే రెండు విడతల రైతుభరోసా ఎగ్గొట్టారని, ఇప్పుడు రావలసిన మూడవ విడతతో కలిపి మొత్తం మూడు విడతల సొమ్మును ఈనెల 11లోగా రైతుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. దీనికి ఎలక్షన్ కోడ్ అడ్డురాదని, తామే ఈసీకి లేఖ ఇస్తామని స్పష్టం చేశారు.
గజ్వేల్ అభివృద్ధి: గజ్వేల్‌లో 250 పడకల ఆసుపత్రి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రైలు సౌకర్యం, చెరువుల సుందరీకరణ వంటి పనులన్నీ కేసీఆర్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు.పెన్షన్ రూ. 4000 ఇస్తామని, మహిళలకు రూ. 2500 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు, కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు వంటి పథకాలను రేవంత్ సర్కార్ నిలిపివేసిందని ఆరోపించారు. పని చేసే వారికే ఓటు వేయాలని, గజ్వేల్ ఆత్మగౌరవం నిలబడాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తును గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.



