బచ్చుగూడ కాంగ్రెస్ లోకి క్యూ కట్టిన కీలక నేతలు
బచ్చుగూడలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మాజీ ఉపసర్పంచ్ జంగారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బచ్చుగూడలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మాజీ ఉపసర్పంచ్ జంగారెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సరిత భుజంగారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరుణాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కిష్టారెడ్డి వంటి ప్రముఖ నేతలు తమ అనుచరులతో కలిసి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు.
పటాన్చెరు కాంగ్రెస్ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్, మెదక్ పార్లమెంట్ ఇంచార్జి నీలం మధు సమక్షంలో వీరంతా కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 11న జరగనున్న ఎన్నికల్లో సరిత భుజంగారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బచ్చుగూడలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తాగునీరు, వీధిదీపాలు, మౌలిక వసతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కేవలం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.



