సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికలపై బీఆర్ఎస్ గురి.. వార్డు ఇన్‌చార్జులతో చింత ప్రభాకర్ సమీక్ష
సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు చెందిన వార్డు మరియు క్లస్టర్ ఇన్‌చార్జులతో బీఆర్ఎస్ పార్టీ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది

సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 38 వార్డులకు చెందిన వార్డు మరియు క్లస్టర్ ఇన్‌చార్జులతో బీఆర్ఎస్ పార్టీ కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, సంస్థాగత బలోపేతంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరియు జిల్లా సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. వార్డు స్థాయిలో ప్రతి ఇన్‌చార్జ్ బాధ్యతగా పనిచేయాలని, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని వారు సూచించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి యాదవ్, సోమిరెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్‌చార్జులు పాల్గొన్నారు.



