తెలంగాణసంగారెడ్డి
కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పిలుపు
బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని, రాబోయేది తమ ప్రభుత్వమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీతోనే పట్టణాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని, రాబోయేది తమ ప్రభుత్వమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని 20, 21 వార్డులలో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆయన విస్తృతంగా పర్యటించారు.
ఈ సందర్భంగా పట్టణ రజక సంఘం అధ్యక్షుడు శివరాజ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. అసాధ్యమైన హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.



