తెలంగాణసంగారెడ్డి
మున్సిపల్ ఎన్నికల వేళ కీలక ఘట్టం: పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జనరల్ అబ్జర్వర్ ఉదయ్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించారు.

మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా పోలింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జనరల్ అబ్జర్వర్ ఉదయ్ కుమార్ సమక్షంలో గురువారం నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్‌లో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం కంప్యూటర్ ద్వారా ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు.
సంగారెడ్డి, సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ – జోగిపేట్ సహా ఇస్నాపూర్, ఇంద్రేశం వంటి కొత్త మున్సిపాలిటీల్లో విధులను నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు (PO), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (APO), ఇతర పోలింగ్ సిబ్బందిని ఈ ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, డీఈఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి త్వరలోనే శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.



