Indresham: వార్డుల్లో బిఆర్ఎస్ సుడిగాలి పర్యటన – అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది.

పటాన్‌చెరు: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ తన దూకుడును పెంచింది. ఇంద్రేశం మున్సిపాలిటీ వార్డు నెం. 1, 4లలో బిఆర్ఎస్ అభ్యర్థులు దండు శ్రావంతి, నర్సిములు విజయమే లక్ష్యంగా నాయకులు విస్తృతమైన ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్‌చార్జి గోసుల శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొని ఓటర్లను నేరుగా కలిశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, గత బిఆర్ఎస్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలోనే గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాయని, ఆ అభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మాజీ సర్పంచులు రాంచందర్ రెడ్డి, కృష్ణ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



