తెలంగాణసంగారెడ్డి

Andole – Jogipet: విద్య, వైద్య హబ్‌గా అందోల్ – జోగిపేట.. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా.. దామోదర రాజనరసింహ ధీమా

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

అందోల్: అందోల్-జోగిపేట మున్సిపాలిటీకి పరిశ్రమలను తీసుకువచ్చి, స్థానిక మహిళలు,యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. శనివారం జోగిపేట పట్టణంలోని 11, 12, 13, 14, 15, 16, 17, 18 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

80 శాతం సీట్లు పక్కా…
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. అందోల్ జోగిపేటను విద్య, వైద్య కేంద్రాల హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, ఇందులో భాగంగా జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కాలేజీ, ఏకీకృత పాఠశాలలు, అధునాతన ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 నుంచి 80 శాతం సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని, అందుకే ఏ వార్డుకు వెళ్లినా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, ఏఎంసీ చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టిబాబు, ఆ పార్టీ సీనియర్ నేత శేరి జగమ్మోహన్ రెడ్డి, సురేందర్ గౌడ్, కృష్ణారెడ్డి, పార్టీ పరిశీలకులు కైలాష్ కుమార్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *