బిజినెస్

కొత్త తరం మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లను తయారు చేసేందుకు ‘హర్ ఘర్ ఎంఎఫ్‌డీ’ని ప్రారంభించిన అసెట్ ప్లస్!

మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌ను మరింత మందికి అందుబాటులో ఉండే వృత్తిగా మార్చడానికి , ఆసక్తి గల వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి ఉచితంగా జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో 'హర్ ఘర్ ఎంఎఫ్డి' అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని అసెట్ ప్లస్ ఇవాళ ప్రారంభించింది

ముంబై: మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌ను మరింత మందికి అందుబాటులో ఉండే వృత్తిగా మార్చడానికి , ఆసక్తి గల వారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి ఉచితంగా జ్ఞానాన్ని అందించే లక్ష్యంతో ‘హర్ ఘర్ ఎంఎఫ్డి’ అనే దేశవ్యాప్త కార్యక్రమాన్ని అసెట్ ప్లస్ ఇవాళ ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఎండీ , సీఈఓ నవనీత్ మునోత్, కోటక్ మహీంద్రా ఏఎంసీ ఎండీ నీలేష్ షా, ఈడల్‌వైస్ మ్యూచువల్ ఫండ్ ఎండీ , సీఈఓ రాధికా గుప్తా, సుందరం మ్యూచువల్ ఫండ్ మాజీ ఎండీ , సీఈఓ సునీల్ సుబ్రహ్మణ్యం, అసెట్ ప్లస్ ఫౌండర్స్ విశ్రాంత్ సురేష్ , అవనీష్ రాజ్ సమక్షంలో ప్రారంభించారు.

భారత మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఒక కీలక దశకు చేరుకుంది. ఈ పరిశ్రమ ఆస్తులు రూ. 81 లక్షల కోట్లు దాటాయి. ప్రతి నెలా వచ్చే ఎస్ ఐ పి (SIP) పెట్టుబడులు సుమారు రూ. 31 వేల కోట్లకు చేరుకున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల భాగస్వామ్యం కూడా అంతకంతకూ పెరుగుతోంది. అయితే వేగంగా పెరుగుతున్న ఈ పెట్టుబడిదారులకు సేవలు అందించడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల (MFD) సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు 1.8 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ భారతీయ కుటుంబాల్లోకి మరింత లోతుగా వెళ్తున్న తరుణంలో, మంచి అవగాహన , సామర్థ్యం ఉన్న డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను పెంచడం ఈ పరిశ్రమకు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అవసరంగా మారింది.

హర్ ఘర్ ఎంఎఫ్‌డీ (Har Ghar MFD) అనేది ఒక స్పష్టమైన నమ్మకం ఆధారంగా రూపొందింది: ప్రతి ఇంటికి ఒక ఎంఎఫ్‌డీ, తద్వారా ప్రతి భారతీయ కుటుంబానికి బలమైన భవిష్యత్తు ఉండాలన్నదే ఆ నమ్మకం.

ఈ కార్యక్రమం ప్రారంభం గురించి అసెట్ ప్లస్ సీఈఓ , కో-ఫౌండర్ విశ్రాంత్ సురేష్ మాట్లాడుతూ.. “భారత మ్యూచువల్ ఫండ్ వృద్ధి కేవలం మరిన్ని ఉత్పత్తులు, ఎక్కువ ప్లాట్‌ఫారమ్‌లు లేదా లావాదేవీల మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కుటుంబాలకు స్పష్టతతో , క్రమశిక్షణతో సరైన మార్గనిర్దేశం చేయగల నమ్మకమైన వ్యక్తులు కూడా దీనికి ఎంతో అవసరం. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌ను దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు ఉన్న, నమ్మకమైన , అర్థవంతమైన వ్యాపార అవకాశంగా మార్చాలన్నదే ఈ హర్ ఘర్ ఎంఎఫ్‌డీ ద్వారా మా ప్రయత్నం. కేవలం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం మాత్రమే మా ఉద్దేశం కాదు, ఈ పరిశ్రమ యొక్క తదుపరి వృద్ధికి తోడ్పడేలా డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యను పెంచడంలో సహాయపడటమే మా అసలు లక్ష్యం” అని అన్నారు.

హర్ ఘర్ ఎంఎఫ్‌డీ వెబ్‌సైట్ ద్వారా ఒరిజినల్ వీడియో లెర్నింగ్ సిరీస్, ఎడిటోరియల్ కథనాలు, మార్కెట్ , నియంత్రణ సంస్థల అప్‌డేట్స్, అసెట్ ప్లస్ రీసెర్చ్ టీమ్ నుండి హర్ ఘర్ ఫిన్‌సైట్ (FinSight) విశ్లేషణలు, ప్రాక్టికల్ టూల్స్, కాలిక్యులేటర్లు , ఏఐ ఆధారిత కంటెంట్ సెర్చ్ వంటివన్నీ ఒకే చోట లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లకు కావలసిన జ్ఞానాన్ని, సమాచారాన్ని ఉచితంగా అందించే ఒకే ఒక్క వేదికగా ఇది పనిచేస్తుంది.

హర్ ఘర్ ఎంఎఫ్‌డీ గురించి అసెట్ ప్లస్ కో-ఫౌండర్ , సీటీఓ అవనీష్ రాజ్ మాట్లాడుతూ.. “సమాచారం అందుబాటులో లేకపోవడం అనేది సమస్య కాదు. ఉన్న సమాచారం అంతా చెల్లాచెదురుగా ఉండటం, వెతకడానికి కష్టంగా ఉండటం , ఒక డిస్ట్రిబ్యూటర్‌కు ఆ సమయానికి కావలసినది దొరకకపోవడమే అసలైన సమస్య. అందుకే హర్ ఘర్ ఎంఎఫ్‌డీ ద్వారా మేం టెక్నాలజీని ఉపయోగించి, అవసరమైన సమాచారాన్ని సులభంగా కనుగొనేలా , దానిని ఆచరణలో పెట్టేలా చేస్తున్నాము. ఇది కేవలం ఒక కంటెంట్ లైబ్రరీలా కాకుండా, ఈ వృత్తికి ఒక జీవనాడిలా ఉండేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించాము” అని అన్నారు.

భారతదేశవ్యాప్తంగా 21,000 మందికి పైగా ఎంఎఫ్డి భాగస్వాములను కలిగి ఉండి, రూ. 8,000 కోట్లకు పైగా ఆస్తులను (AUM) , 1.5 లక్షల మందికి పైగా పెట్టుబడిదారులకు సేవలు అందిస్తున్న అసెట్ ప్లస్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తూనే ఉంది. హర్ ఘర్ ఎంఎఫ్‌డీ ద్వారా కేవలం వ్యాపార వృద్ధికే కాకుండా, ఈ వృత్తిలోకి మరిన్ని కొత్త వ్యక్తులు వచ్చేలా చేసి, వారి అవగాహనను పెంచి, ఈ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అసెట్ ప్లస్ అడుగులు వేస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *