కోర్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా భారత్ పాత్రను సుస్థిరం.. హైదరాబాద్ టెక్ సెంటర్‌ను ప్రారంభించిన కాండిసెంట్
ప్రముఖ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ 30,000 చదరపు అడుగుల సదుపాయంతో హైదరాబాద్‌లో తన ఉనికిని విస్తరించింది.

హైదరాబాద్, ఏప్రిల్ 16, 2026: అమెరికాకు చెందిన ప్రముఖ ఇంటెలిజెంట్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ కాండిసెంట్(Candescent) తమ సరికొత్త టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు ఇవాళ ప్రకటించింది. తమ గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌కు శక్తినిచ్చే కోర్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ హబ్‌గా భారతదేశ స్థానాన్ని ఈ కేంద్రం మరింత బలోపేతం చేయనుంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని రహేజా మైండ్‌స్పేస్ ఐటీ పార్క్‌లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 260 మంది కూర్చునే సామర్థ్యంతో ఏర్పాటు చేసిన ఈ కొత్త సదుపాయం నగరంలో కాండిసెంట్ ఉనికిని వ్యూహాత్మకంగా విస్తరించడంలో ఒక మైలురాయిగా నిలిచింది. కంపెనీ తన ప్రస్తుత హైదరాబాద్ కార్యాలయం నుండి కూడా కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇది 2027 వరకు అందుబాటులో ఉంటుంది. సంస్థ బృందాలు రెండు ప్రదేశాలలోనూ పని చేస్తాయి. ఈ రెండు కేంద్రాలు తక్షణ వృద్ధిని మాత్రమే కాకుండా భారతదేశం పట్ల సంస్థకు ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి.
కాండిసెంట్ సంస్థకు భారతదేశం అనేది కేవలం అంతర్జాతీయ కార్యకలాపాల విస్తరణ మాత్రమే కాదు, వాటిలో కీలక భాగం. ముంబై మరియు బెంగళూరులో కార్యాలయాలతో పాటు 800 మందికి పైగా ఇంజినీర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. ఈ భారతీయ బృందాలే కంపెనీకి చెందిన క్లౌడ్ నేటివ్ ఫుల్ స్టాక్ డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ ఆర్కిటెక్చర్, డిజైన్, నిర్మాణం, నిర్వహణ వంటి కీలక బాధ్యతలను చూస్తున్నాయి. ప్రస్తుతం అమెరికాలోని 1,300 కంటే ఎక్కువ బ్యాంకులు, క్రెడిట్ యూనియన్లకు ఈ ప్లాట్‌ఫారమ్ సేవలు అందిస్తోంది. దాదాపు 30 మిలియన్ల మంది యూజర్లు దీనిని ఉపయోగిస్తున్నారు.
కాండిసెంట్ సంస్థలో మేం నిర్మిస్తున్న ప్రతి దానికి భారతే పునాది అని ఆ సంస్థ సీఓఓ జాన్ గార్వే(John Garvey) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. “కాండిసెంట్ లో మేం నిర్మిస్తున్న వాటిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. మా సిబ్బందిలో దాదాపు 75 శాతం మంది ఇంజినీరింగ్ విభాగంపైనే దృష్టి సారించారు. ఇది మాది ఇంజినీరింగ్, డిజైన్ ఆధారిత సంస్థ అనే గుర్తింపును నొక్కి చెబుతోంది. రియల్ టైమ్ పేమెంట్స్ మరియు హై వాల్యూమ్ సిస్టమ్స్ నుండి ఏఐ ఆధారిత వర్క్ ఫ్లోస్ మరియు రెసిలెంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వరకు మా ప్లాట్‌ఫారమ్‌లోని కీలక భాగాలపై ఇక్కడి బృందాలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ నుండి జరుగుతున్న ఈ పని లక్షల సంఖ్యలో వినియోగదారుల బ్యాంకింగ్ అనుభవాలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ఈ కొత్త సదుపాయం ఆ ప్రభావ స్థాయిని, దానిని మరింత వృద్ధి చేయాలనే మా ఆకాంక్షను ప్రతిబింబిస్తోంది” అని వివరించారు.
కాండిసెంట్ ప్రస్తుతం తన ఇంటెలిజెంట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించి పెట్టుబడులు మరియు ఆవిష్కరణలలో బలమైన దశలో ఉంది. భారతదేశం నుండి సాగుతున్న ఇంజినీరింగ్ పనులు ఆన్‌బోర్డింగ్ మరియు లావాదేవీల నుండి రియల్ టైమ్ పేమెంట్స్ మరియు బ్రాంచ్ సిస్టమ్స్ వరకు పూర్తి డిజిటల్ బ్యాంకింగ్ స్టాక్‌ను కవర్ చేస్తున్నాయి. ఇవన్నీ హై స్కేల్ మరియు క్లౌడ్ నేటివ్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మితమయ్యాయి. ఇక్కడి బృందాలు అవైలబిలిటీ, పర్ఫార్మెన్స్ మరియు సిస్టమ్ ఇంటిగ్రేషన్ వంటి క్లిష్టమైన సవాళ్లను పరిష్కరిస్తున్నాయి. అలాగే డెవలప్మెంట్ మరియు ఆపరేషన్లలో ఏఐ వినియోగాన్ని క్రమంగా పెంచుతున్నాయి. హైదరాబాద్ టెక్ సెంటర్ ఈ తదుపరి వృద్ధి దశకు మద్దతు ఇచ్చేలా రూపొందింది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్, ప్రొడక్ట్, డేటా మరియు ప్లాట్‌ఫారమ్ విభాగాలలో బృందాలను భారీగా విస్తరిస్తున్నారు. తన టాలెంట్ పైప్‌లైన్‌ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఐఐటీ ఎకోసిస్టమ్‌తో సహా ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కూడా కంపెనీ పరిశీలిస్తోంది. దీనితో పాటు భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా బలమైన ప్రతిభావంతులను తయారు చేసేందుకు తమ కొత్త సౌకర్యాల ద్వారా ఒక పటిష్టమైన గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో కాండిసెంట్ పెట్టుబడి పెడుతోంది.
“భారత్‌లో మా ప్రయాణం ఎప్పుడూ నిర్మాణానికి సంబంధించినది మాత్రమే కానీ, కేవలం మద్దతు ఇవ్వడానికి కాదు. మా పరిణామ క్రమంలో హైదరాబాద్ తదుపరి దశకు ప్రాతినిధ్యం వహిస్తోంది” అని కాండిసెంట్ ఇండియా ఆపరేషన్స్ జనరల్ మేనేజర్, ఎస్వీపీ రాఘవ పవమాన్(Raghav Pavaman) తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “భారత్‌లో ఆవిష్కరణలు చురుగ్గా రూపుదిద్దుకుంటాయి. ఇక్కడ ఇంజినీర్లు ఆర్కిటెక్చర్ నుండి ప్రొడక్షన్ వరకు ఎండ్-టు-ఎండ్ యాజమాన్యాన్ని తీసుకుంటారు. వారు భారీ స్థాయిలో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యలను పరిష్కరిస్తూ, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉపయోగించే ఉత్పత్తులకు నేరుగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. మేం విస్తరిస్తున్న కొద్దీ, పటిష్టమైన ఉద్దేశంతో ఆవిష్కరించేందుకు, భారీ స్థాయి అవసరాల కోసం నిర్మించేందుకు, అర్థవంతమైన, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే ప్రభావాన్ని సృష్టించేందుకు ఉత్సాహంగా ఉన్న ప్రతిభావంతులను తీసుకురావడంపైనే మా దృష్టి ఉంది” అని వివరించారు.
కాండిసెంట్ ఇండియా ఇంజినీరింగ్ నమూనా అనేది యాజమాన్య బాధ్యత, ఆర్కిటెక్చర్ ఆధారిత ఆలోచన, అంతర్జాతీయ బృందాలతో లోతైన సమన్వయంపై నిర్మించారు. హైదరాబాద్‌లోని ఇంజినీర్లు ప్లాట్‌ఫారమ్ రోడ్‌మ్యాప్ నిర్ణయాలలో ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్నారు. వీరు కేవలం అమలులో మాత్రమే కాకుండా, దీర్ఘకాలిక ఉత్పత్తి, సాంకేతిక వ్యూహంలో కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారు.
కాండిసెంట్ తన ప్రపంచవ్యాప్త ఉనికిని విస్తరిస్తున్న కొద్దీ, కేవలం వృద్ధిని పెంచడంలోనే కాకుండా, తన ఇంటెలిజెంట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫారమ్ భవిష్యత్తును నిర్ణయించడంలో కూడా హైదరాబాద్ మరింత కీలక పాత్ర పోషించనుంది.



