బిజినెస్

అక్షయ తృతీయ కోసం నేటి బంగారం ధరను లాక్ చేసుకునే సదుపాయం

హైదరాబాద్: బంగారం ధరల్లో నిరంతరం మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ అక్షయ తృతీయకు కొనుగోలుదారులు ముందుగానే ప్రణాళిక వేసుకునేందుకు వీలుగా నగల వ్యాపారులు సరికొత్త వెసులుబాటును కల్పిస్తున్నారు. భారత దేశపు మొట్టమొదటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఇన్‌స్టామార్ట్ ప్రముఖ సంస్థ కళ్యాణ్ జువెలర్స్‌తో జతకట్టి గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ అనే వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక సదుపాయం ద్వారా వినియోగదారులు ప్రస్తుత బంగారం ధరను లాక్ చేసుకుని అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయవచ్చు. ఒకవేళ అక్షయ తృతీయ రోజున మార్కెట్ ధర తగ్గితే ఆ తక్కువ ధరకే బంగారం పొందవచ్చు లేదా ఒకవేళ ధర పెరిగితే ముందే లాక్ చేసుకున్న తక్కువ ధరకే నగలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఫీచర్ అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి.

అక్షయ తృతీయ సమయంలో బంగారానికి శాశ్వత ప్రాముఖ్యత ఉంది. ఇది శ్రేయస్సుకు మరియు శుభారంభాలకు చిహ్నంగా నిలుస్తుంది. పండుగ సమీపిస్తున్న తరుణంలో వినియోగదారులు తమ కొనుగోలు ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు సౌలభ్యంతో పాటు భరోసా కూడా అంతే ముఖ్యమైనవి. ఇన్‌స్టామార్ట్ అందిస్తున్న గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ సదుపాయం కళ్యాణ్ జువెలర్స్ నుండి బీఐఎస్ (BIS) హాల్‌మార్క్ కలిగిన బంగారు నాణేలను ఆర్డర్ చేసే వినియోగదారులకు ఎంతో సౌకర్యవంతంగా, నమ్మకదాయకంగా ఉంటుంది.

ఇదెలా పనిచేస్తుంది?

ఏప్రిల్ 10 నుండి ఏప్రిల్ 16, 2026 మధ్య కాలంలో వినియోగదారులు ఇన్‌స్టామార్ట్ యాప్‌లో కళ్యాణ్ జువెలర్స్ గోల్డ్ కాయిన్స్‌ను ఎంచుకుని 5 శాతం అడ్వాన్స్ చెల్లించాల్సి ఉంటుంది. 0.5 గ్రాముల బంగారు నాణెం కోసం రూ.500 నుండి ప్రారంభమయ్యే ఈ అడ్వాన్స్‌ను చెల్లించి అక్షయ తృతీయ రోజున డెలివరీ పొందేలా ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 8:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య ప్రీబుకింగ్ నాటి బంగారం ధర లేదా డెలివరీ తేదీ నాటి ధరలలో ఏది తక్కువగా ఉంటే ఆ ధరకు చెల్లింపు పూర్తి చేయవచ్చు. ఈ విధంగా ప్రీబుకింగ్ చేసుకున్న వినియోగదారులందరికీ కళ్యాణ్ జువెలర్స్ నుండి ఒక వెండి నాణెం ఉచితంగా లభిస్తుంది.

ఇన్‌స్టామార్ట్  వీపీ గ్రోత్(VP Growth), అర్జున్ చౌదరి మాట్లాడుతూ..”ధన్తేరాస్ సమయంలో 1 కేజీ వెండి ఇటుకలను డెలివరీ చేయడం నుండి రక్షా బంధన్ కోసం వెండి రాఖీలను పరిచయం చేయడం వరకు కీలక సందర్భాల్లో భారతీయులు విలువైన లోహాలను కొనుగోలు చేసే విధానంలో ఇన్‌స్టామార్ట్ నిరంతరం ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తోంది. గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ అనేది పండుగ సమయంలో వినియోగదారులు మరింత నమ్మకంతో బంగారం ధరలను గమనిస్తూ కొనుగోలు చేసేలా రూపొందించిన ఫీచర్. వినియోగదారులు ముందుగానే ధరను సురక్షితం చేసుకునేందుకు అనుమతించడంతో పాటు ధరలు తగ్గితే ఆ ప్రయోజనాన్ని కూడా వారికే అందించడం ద్వారా మేము వారికి మెరుగైన విలువను అందించాలని కోరుకుంటున్నాము. సాంస్కృతిక ప్రాముఖ్యత ఉన్న కొనుగోళ్లలో కేవలం సౌలభ్యం మాత్రమే కాకుండా అర్థవంతమైన విలువను అందించడానికి క్విక్ కామర్స్ కృషి చేస్తోందనడానికి ఇది నిదర్శనం” అని పేర్కొన్నారు.

కళ్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, రమేష్ కళ్యాణరామన్ మాట్లాడుతూ.. “కళ్యాణ్ జువెలర్స్ రిటైల్ షోరూమ్‌లలో గోల్డ్ రేట్ ప్రొటెక్షన్ అనేది వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే ఫీచర్. ఇది పండుగ కొనుగోళ్లను ప్లాన్ చేసుకునేటప్పుడు కస్టమర్లకు గొప్ప భరోసాను ఇస్తుంది. ఇప్పుడు ఇన్‌స్టామార్ట్‌తో కలిసి మొదటిసారిగా ఈ సదుపాయాన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌కు విస్తరిస్తున్నాము. సంప్రదాయాలు మారుతున్న కొద్దీ బంగారం కొనుగోలు ప్రక్రియను మరింత అర్థవంతంగా, సులభతరంగా మార్చడానికి మేం కట్టుబడి ఉన్నాం”అని అన్నారు.

గతేడాది ధంతేరాస్‌తో పోలిస్తే అక్షయ తృతీయ రోజున ఇన్‌స్టామార్ట్ బంగారం మరియు వెండి నాణేల అమ్మకాలలో 500 శాతానికి పైగా వృద్ధిని సాధించింది. శుభప్రదమైన కొనుగోళ్లకు నమ్మదగిన వేదికగా క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల పట్ల భారతీయ వినియోగదారులలో పెరుగుతున్న ఆసక్తిని ఇది స్పష్టం చేస్తోంది.

రోజువారీ నిత్యావసర వస్తువులే కాకుండా పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలకు సంబంధించిన కొనుగోళ్లకు కూడా ఇన్‌స్టామార్ట్ ఒక ప్రధాన వేదికగా మారుతోంది. వినియోగదారులు ఆశించే వేగం మరియు నమ్మకంతో ఇలాంటి విలువైన వస్తువులను డెలివరీ చేస్తూ తనదైన ముద్ర వేస్తోంది.

ఈ ఆఫర్‌లో భాగంగా అందించే అన్ని బంగారు నాణేలు మరియు ఉచితంగా ఇచ్చే వెండి నాణేలు బీఐఎస్(BIS) హాల్‌మార్క్ కలిగిన 24 క్యారెట్ కళ్యాణ్ జువెలర్స్ నాణేలు. ఇవి స్టాక్ లభ్యతకు, సంస్థ నిబంధనలకు లోబడి అందిస్తారు.

 

నిబంధనలు, షరతులు వర్తిస్తాయి

గోల్డ్ ప్రైస్ లాక్ అనేది ఇన్‌స్టామార్ట్‌లో అందుబాటులో ఉన్న ఎంపిక చేసిన కళ్యాణ్ జువెలర్స్ ఉత్పత్తులపై విక్రేతలు పరిమిత కాలం పాటు అందిస్తున్న ఆఫర్. దీని కోసం ధర లాక్ ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 19, 2026 న ఉదయం 8:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల మధ్య చేసే తుది కొనుగోలులో సర్దుబాటు చేస్తారు. వినియోగదారుడు లాక్ చేసిన ధర లేదా ఆ రోజు మార్కెట్‌లో ఉన్న ధరలలో ఏది తక్కువగా ఉంటే అదే తుది ధరగా పరిగణిస్తారు. ఉచిత వెండి నాణేంతో కూడిన ఈ ఆఫర్ స్టాక్ లభ్యత, అదనపు నిబంధనలు, షరతులకు లోబడి ఉంటుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *