తెలంగాణసంగారెడ్డి

Sangareddy: సంగారెడ్డి జిల్లాలో.. రెవెన్యూ అధికారులకు స్థాన చలనం!

సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్​ తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్​ పి. ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులిచ్చారు.

  • డిప్యుటేషన్లపై కొత్త స్థానాల్లో పోస్టింగులు ఇస్తూ కలెక్టర్​ పి.ప్రావీణ్య ఉత్తర్వులు
  • పటాన్​ చెరు తహసీల్దారుగా ఎన్​. హరిబాబు

కందిలి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో తహసీల్దార్లు, నాయబ్​ తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగులను బదిలీ చేస్తూ కలెక్టర్​ పి. ప్రావీణ్య శుక్రవారం ఉత్తర్వులిచ్చారు. డిప్యుటేషన్లపై వారిని కొత్త స్థానాల్లో బాధ్యతలు ఇస్తూ వీటిని జారీ చేశారు. సంగారెడ్డి జిల్లాకు కేటాయించిన ఎన్​. హరిబాబుకు సంగారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో డీఏవోగా పోస్టింగ్​ ఇచ్చారు. డిప్యుటేషన్​ పై పటాన్​ చెరు తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు.

అందోలు– జోగిపేట ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న నాయబ్​ తహసీల్దారు పి.శ్రీనివాస్​ గౌడ్​ ను కలెక్టరేట్లోని సూపరింటెండెంట్​ – డి విభాగానికి పంపించారు.

సంగారెడ్డిలోని డీటీఎస్​ఓ కార్యాలయంలో డీటీసీఎస్​ గా పనిచేస్తున్న లింగ శేఖర్​ ను పటాన్​ చెరు నాయబ్​ తహసీల్దారుగా డిప్యూటేషన్​ పై పంపారు.

కలెక్టరు కార్యాలయంలో సీనియర్​ అసిస్టెంటుగా పనిచేస్తున్న జి.సాయిలు పటాన్​ చెరు గిర్దవారుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *