తెలంగాణమెదక్సంగారెడ్డిసిద్దిపేట

BRS: మున్సిపల్​ ఎన్నికలకు.. బీఆర్​ఎస్​ సమన్వయకర్తలు వీరే!

మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్​ జిల్లాలో అత్యధిక పీఠాలను కైవసం చేసుకునేందుకు వీలుగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు.

* ఉమ్మడి మెదక్​ జిల్లావ్యాప్తంగా నేతలకు బాధ్యతలు అప్పగించిన హరీశ్​ రావు
కందిలి, సిద్దిపేట: మున్సిపల్​ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీఆర్​ఎస్​ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్​ జిల్లాలో అత్యధిక పీఠాలను కైవసం చేసుకునేందుకు వీలుగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు సమన్వయకర్తలను నియమించారు. జనవరి 12 నుంచి స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిలతో చర్చించి, ముందుకు సాగాలని ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు ఆదివారం ఈ వివరాలను సంగారెడ్డి జిల్లా బీఆర్​ఎస్​ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ వెల్లడించారు.

మున్సిపాలిటీల వారీగా.. సమన్వయకర్తలు వీరే!
సంగారెడ్డి జిల్లా
1. జహీరాబాద్ – దేవి ప్రసాద్, మాజీ చైర్మన్, బెవరేజెస్ కార్పొరేషన్
2. కోహీర్ – ఎంఏ హకీమ్, న్యాయవాది, బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు
3. సదాశివపేట– సపాన్ దేవ్, మాజీ కార్పొరేటర్
4. సంగారెడ్డి – రాజనర్సు, మున్సిపల్ ఛైర్ పర్సన్, సిద్దిపేట
5. అందోలు–జోగిపేట – పట్లోళ్ల నరహరి రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
6. నారాయణఖేడ్ – జైపాల్ రెడ్డి, బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు
7. జిన్నారం– పాల సాయిరాం, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్
8. గుమ్మడిదల – పట్నం మాణిక్యం, డీసీసీబీ ఉపాధ్యక్షుడు
9. గడ్డపోతారం – సోమిరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్​
10. ఇస్నాపూర్ – ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్​
11. ఇంద్రేశం – రంగినేని అభిలాష్ రావు, బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు

మెదక్​ జిల్లా
1. మెదక్ – ఫరూక్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్సీ
2. రామాయంపేట – రవీందర్ రెడ్డి, సుడా మాజీ ఛైర్మన్​
3. తూప్రాన్​ – సంపత్ రెడ్డి, సిద్దిపేట పట్టణ బీఆర్​ఎస్​ ప్రెసిడెంట్
4. నర్సాపూర్ – వెంకట్రామరెడ్డి, ఎమ్మెల్సీ

సిద్దిపేట జిల్లా
1. దుబ్బాక – భూపేష్ , న్యాయవాది, రాష్ట్ర నాయకుడు
2. గజ్వేల్– రాధాకృష్ణ శర్మ, జడ్పీ మాజీ ఛైర్మన్​

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *