తెలంగాణసంగారెడ్డి

Sangareddy: తొలి రెండు ఇందిరమ్మ ఇళ్లలో గృహ ప్రవేశం.. టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి చేతులమీదుగా ప్రారంభం

పేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం సంగారెడ్డి నియోజకవర్గంలో తొలి ఫలితాలను ఇచ్చింది.

సంగారెడ్డి: పేదల సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం సంగారెడ్డి నియోజకవర్గంలో తొలి ఫలితాలను ఇచ్చింది. నియోజకవర్గంలోని సదాశివపేట మండలం ఆత్మకూరు, కంబాలపల్లి గ్రామాల్లో పూర్తయిన మొదటి రెండు ఇందిరమ్మ ఇళ్లకు సోమవారం గృహ ప్రవేశాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లాంఛనంగా ఇళ్లను ప్రారంభించారు.

కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి వంటిది
ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల పక్షాన ఉంటుందని, ఇది కన్నతల్లి వంటి పార్టీ అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల పేదలు తీవ్రంగా నష్టపోయారని ఆమె విమర్శించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల పేరుతో గత ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిందని, ఒక ఊరి వారికి మరో ఊరిలో ఇళ్లు కేటాయించడం వల్ల మౌలిక వసతులు లేక అవి నిరుపయోగంగా మారాయని ఆరోపించారు.

ఐదు లక్షల ఆర్థిక సాయం.. ప్రతి ఒక్కరికీ భరోసా
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం మాటలు చెప్పకుండా, ప్రతి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించిందని ఆమె తెలిపారు. లబ్ధిదారులు తాము నివసించే ఊరిలోనే సొంత ఇంటిని నిర్మించుకునేలా ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఈ 5 లక్షల రూపాయలు అందుతాయని, డబ్బులు వస్తాయో రావో అన్న సందేహాలు అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ గృహ ప్రవేశ వేడుకలో నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మకూరు సర్పంచ్ నికిత బింబాధర చారి, మాజీ సర్పంచ్ గంగన్న, హౌజింగ్ డీఈ మాధవ రెడ్డి, ఏఈ రేష్మ పాల్గొన్నారు. అలాగే కంబాలపల్లి సర్పంచ్ ఇందురి భారతమ్మ బాబు, ఆత్మకూరు ఉప సర్పంచ్ అశోక్, కంబాలపల్లి ఉప సర్పంచ్ పార్వతమ్మ ఆంజనేయులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసబ్ తదితరులు పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *