తెలంగాణసంగారెడ్డి

Road Accident: దూసుకొచ్చిన ఫ్లెక్సీ ఫ్రేమ్​.. అమ్మాయి ప్రాణాలు బలిగొంది!

ట్రాలీ ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని తీవ్రగాయాల పాలు చేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం ఆలయం సమీపంలో చోటు చేసుకుంది

* సంగారెడ్డి వైకుంఠపురం ఆలయం సమీపంలో రోడ్డు ప్రమాదం
* అతి వేగంగా ఓవర్​ టేక్​ చేస్తూ బస్సును ఢీకొట్టిన ఆటో డ్రైవర్​
* ఫ్లెక్సీ ఫ్రేమ్స్​ వచ్చి బస్సుల్లో ఉన్నవారికి గుచ్చుకున్న ఘటన
* తీవ్ర గాయాలపాలై మృత్యువాతపడ్డ ఇంజినీరింగ్​ విద్యార్థిని పూజ
* గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్న మంత్రి దామోదర్​

కందిలి, సంగారెడ్డి: ట్రాలీ ఆటో డ్రైవర్​ నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరికొందరిని తీవ్రగాయాల పాలు చేసింది. ఈ దారుణ ఘటన సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురం ఆలయం సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇంజినీరింగ్​ విద్యార్థిని మృతిచెందగా, ఏడుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్​ రాజనర్సింహ ఈ అంశమై స్పందించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

అతివేగం, నిర్లక్ష్యమే.. ప్రమాదానికి కారణం!
ఆర్టీసీ బస్సు సంగారెడ్డి నుంచి నారాయణఖేడ్​ వెళ్తోంది. సంగారెడ్ది పట్టణం దాటి వైకుంఠపురం ఆలయం సమీపంలోకి రాగానే ఈ ప్రమాదం జరిగింది. సంగారెడ్డి వైపు వస్తున్న బస్సును విపరీతమైన వేగంతో ఓవర్​ టేక్​ చేసేందుకు ట్రాలీ ఆటో డ్రైవర్​ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఈ బస్సును ఢీకొట్టాడు. దీంతో ట్రాలీలో ఉన్న ఫ్లెక్సీ ఫ్రేమ్స్​ బస్సులోకి దూసుకొచ్చాయి. డ్రైవర్​ వెనకాల సీట్లో మధ్యలో కూర్చున్న పూజ తలలో గుచ్చుకున్నాయి. డ్రైవర్​ తో పాటు మరికొందరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ప్రాణాలు కోల్పోయిన.. ఇంజినీరింగ్​ విద్యార్థిని!
నారాయణఖేడ్​ మండలం ర్యాకల్​ గ్రామానికి చెందిన పూజ బాసర ట్రిపుల్​ఐటీలో ఇంజినీరింగ్​ మొదటి సంవత్సరం చదువుతోంది. ఫ్లెక్సీ ఫ్రేమ్​ రాడ్​ వచ్చి ఆమె తలలో బలంగా గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. ఆ అమ్మాయి ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలొదింది. పండగ వేళ ఈ ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *